‘ఆర్‌ఎక్స్‌100’ హీరోయిన్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ | Rx 100 Fame Payal Rajput Signs Her Second Film | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 11:51 AM | Last Updated on Wed, Sep 5 2018 11:53 AM

Rx 100 Fame Payal Rajput Signs Her Second Film - Sakshi

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్‌ఎక్స్‌100. అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా తొలి సినిమాలోనే బోల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే పాయల్‌ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ భామ తన రెండో సినిమాకు ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భానుశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పాయల్ యాక్షన్స్‌ సీన్స్‌ కూడా చేయనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు సీ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కించనున్న మరో సినిమాకు కూడా పాయల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement