
కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకునే శర్వానంద్ ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏకే ఎంటర్‌టై¯Œ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఇందులో శర్వానంద్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేయనున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంటె¯Œ ్స లవ్–యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నాం. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఆశ్చర్యపరిచే ఏదో ఒక సంచలన ప్రకటన వెలువడుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment