'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ జోష్‌తో ఆయన మహాసముద్రం సినిమాను రూపొందించారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్నారు.
ఇప్పటికే దీనికి 'మంగళవారం' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ హీరోగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. లేడీ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ ఈ వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment