
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఘన విజయం సాధించిన కార్తికేయ ప్రస్తుతం హిప్పీ, గుణ 369 చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటిస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోతో కలిసి నటించేందుకు కార్తికేయ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
కార్తికేయకు బ్రేక్ ఇచ్చిన అజయ్ భూపతి తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు కార్తికేయను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అజయ్ అడగటంతో కార్తికేయ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడట. ఈ సినిమాలో చైతూకు జోడిగా సమంత నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.