
‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక హీరోగా శర్వానంద్ పేరుని ఎప్పుడో ప్రకటించిన చిత్రబృందం తాజాగా మరో హీరోగా సిద్ధార్థ్ నటించబోతున్నట్లు తెలిపింది.
చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రమిది. సిద్ధార్థ్ చివరిగా ‘గృహం’, ‘వదలడు’ అనే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సౖరైన స్క్రిప్ట్‌తో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇవ్వాలనుకున్న సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ కథ నచ్చటంతో ప్రాజక్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతివారం ఓ ప్రకటన విడుదల చేస్తామని చిత్రబృందం తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment