
అజయ్ భూపతి
తొలి సినిమాకే ‘ఆర్‌ఎక్స్ 100’ లాంటి బోల్డ్ స్క్రిప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. మరి నెక్ట్స్ సినిమాకి ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తారో అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ అజయ్ భూపతి మల్టీస్టారర్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారనే విషయం తెలిసిందే. తాజా వార్తేంటంటే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయిపోయాయట. ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ కూడా వినిపించారని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ మల్టీస్టారర్‌లో కనిపించే హీరోలెవరో అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment