స్టార్‌ హీరో తనయుడితో అజయ్‌ భూపతి కొత్త సినిమా! | RX 100 Fame Ajay Bhupathi Next Film With Dhruv Vikram | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో తనయుడితో అజయ్‌ భూపతి కొత్త సినిమా!

Published Wed, Sep 25 2024 2:45 PM | Last Updated on Wed, Sep 25 2024 3:06 PM

RX 100 Fame Ajay Bhupathi Next Film With Dhruv Vikram

తొలి సినిమా ‘ఆర్‌.ఎక్స్‌ 100’తోనే టాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్టించాడు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ‘మంగళవారం’మూవీతో మళ్లీ కల్ట్‌ హిట్‌ కొట్టాడు. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. 

(చదవండి:  దేవర..ఇక్కడ 20.. అమెరికాలోనూ 20కి పైనే!)

ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. దీంతో అజయ్‌ నెక్ట్స్‌ మూవీ అదే అకున్నారు. కానీ దాని కంటే ముందు ఓ భారీ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట అజయ్‌.

యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో ఓ మంచి స్టోరీ రెడీ చేశాడట. ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు పాటు తమిళ్‌లో కూడా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్‌ మొత్తం రెడీ అయిందట.  ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఓ భారీ నిర్మాత సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement