స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌? | Ravi Teja and Siddharth to team up | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

Published Sat, Jul 20 2019 12:27 AM | Last Updated on Sat, Jul 20 2019 12:27 AM

Ravi Teja and Siddharth to team up - Sakshi

సిద్ధార్థ్‌,రవితేజ

విశాఖపట్నంలో స్మగ్లింగ్‌ చేయడానికి స్కెచ్‌ వేస్తున్నారట రవితేజ. ఆ ప్లాన్‌కు హెల్ప్‌ చేస్తున్నారట సిద్ధార్థ్‌. మరి.. వీరిద్దరి పార్టనర్‌షిప్‌ వివరాలు తెలుసుకోవాలంటే చాలా టైమ్‌ పడుతుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి సూపర్‌హిట్‌ను అందించిన అజయ్‌భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ, సిద్ధార్ధ్‌ హీరోలుగా నటించనున్నారు. రవితేజకు జోడీగా అదితీరావ్‌ హైదరీ కనిపించనున్నారు. సిద్ధార్థ్‌ సరసన హీరోయిన్‌ ఎంపిక కావాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. విశాఖపట్నం నేపథ్యంతో లవ్, ఎమోషన్‌ అంశాలకు స్మగ్లింగ్‌ ఎలిమెంట్‌ను స్క్రిప్ట్‌కు జత చేశారట అజయ్‌ భూపతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement