
మౌత్ పబ్లిసిటీతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది ఆర్‌ఎక్స్ 100 చిత్రం. ఈ మధ్య రిలీజ్ అయిన చిత్రాల్లో క్రౌడ్‌పుల్లర్‌గా నిలిచిన ఈ చిత్రం.. త్వరలో బాలీవుడ్‌లోకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విటర్‌లో తెలియజేశారు. (`ఆర్‌ఎక్స్ 100` మూవీ రివ్యూ)
‘కంగ్రాచ్యూలేషన్ అజయ్ భూపతి.. నీ సూపర్ బ్లాక్ బస్టర్ ఆర్‌ఎక్స్ 100 ఆత్రేయపురం నుంచి ముంబైకి చేరుకుంది. హిందీలో ఫాంటోమ్ ప్రొడక్షన్‌లో మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు(అమీర్ ఖాన్ గజిని నిర్మాతల్లో ఒకరు)’ అని వర్మ తెలియజేశారు. అయితే పాత్రధారులు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. అన్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి వర్మ శిష్యుల్లో ఒకరు అన్న విషయం తెలిసిందే.
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. బోల్డ్ కంటెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment