
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా 'మంగళవారం'. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. తాజాగా మాస్క్ వెనుక ఉన్న నటుడు ప్రియదర్శి అని రివీల్ చేశారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రియదర్శికి ఉన్న మాస్క్ విశ్వక్ సేన్ తీశారు









































