
అజయ్ భూపతి
‘ఆర్‌ఎక్స్ 100’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. అది సెట్స్ మీదకు వెళ్లకముందే తన మూడో సినిమాను ప్రకటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ఓ పెద్ద హీరో నటించనున్నారని ప్రకటించారు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే... రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఇప్పుడు హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment