‘‘సినిమాలు విడదలైనప్పుడు యాక్టర్స్‌కు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా? అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో నాకో కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేశాడు’’ అన్నారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో అతిదీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘అర్జున్ పాత్రలో శర్వా, విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వా జ్వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ‘మహాసముద్రం’ ఒక అద్భుతమైన సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా’’ అని అన్నారు. ‘‘కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు. కథే హీరోలను వెతుక్కుంటుందంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్‌ల దగ్గర ఆగింది. మన స్నేహితుడు మంచోడైనా, చెడ్డోడైనా వదలొద్దన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఫీమెల్ సెంట్రిక్ కథల్లో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’’ అన్నారు అదితీరావ్ హైదరీ. ‘‘ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో అజయ్ భూపతికి ఉన్న నమ్మకం ఇప్పుడు మా అందరిలోనూ ఉంది’’ అన్నారు అనిల్ సుంకర.
Comments
Please login to add a commentAdd a comment