చై సై? | nagachaitanya, ajay bhupathi next movie | Sakshi
Sakshi News home page

చై సై?

Published Thu, Apr 18 2019 12:42 AM | Last Updated on Thu, Apr 18 2019 12:42 AM

nagachaitanya, ajay bhupathi next movie - Sakshi

నాగచైతన్య

‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ వెంకటేశ్‌తో కలసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే సినిమా ఏంటంటే.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ అజయ్, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్స్‌ కూడా నడిచాయట. అజయ్‌ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్‌ అయిన చైతూ ‘వెంకీ మామ’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్‌ చేయనున్నారట. ఈ చిత్రానికి చై సై అన్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌ బ్యానర్‌పై పి. కిరణ్‌ నిర్మించనున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement