పవిత్ర హృదయం, నిశ్చలమైన భక్తితోనే ‘శ్రీనివాసో విజయతే’ వంటి అపురూప గ్రంథాలను వేలకొలది భక్తగణానికి నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి సమర్పించగలిగారని ‘ద్వారకా తిరుమల’ అర్చక బృందం ప్రశంసల వర్షం కురిపించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ‘శ్రీనివాసో విజయతే’ ఏడు వేల ప్రతులను ద్వారకా తిరుమల దేవస్థాన అధికారులకు అందజేశారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సాయి కొర్రపాటి ఉచితంగా పంపిణిచేశారు. కాగా, ఈ గ్రంథాలు చదివిన భక్తులు తిరుమలేశుడి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ 'శ్రీనివాసో విజయతే' గంధాన్ని రచించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ప్రచురించింది. గతంలో నందమూరి బాలకృష్ణ సమర్పణలో 500 అఖండ ఆంజనేయ చిత్రాలతో, యంత్ర మంత్రాత్మకంగా 'నేనున్నాను' మహాగ్రంథాన్ని వారాహి సంస్థ ప్రచురించింది. ఈ గ్రంథాన్ని కూడా పురాణపండ శ్రీనివాస్ రచించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్‌పై బాలకృష్ణ, సాయికొర్రపాటి ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment