Puranapanda srinivas
-
మోదీ సంకల్పం కోసం పురాణపండ
సాక్షి, హైదరాబాద్: మహామ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురుచేస్తోంది. ఈ అంతుచిక్కని వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో భారత్‌తో పాటు అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ భయంకర వైరస్ బారి నుంచి రక్షించమని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ సంకల్పానికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సమర్పణలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు సుధీష్ రాంభట్ల, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు ఒక అద్భుతమైన దైవీయ గ్రంథాన్ని ప్రచురించనున్నారు. దేశరాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ప్రతులు ఉచితంగా పంపిణీ చేసుందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆది శంకరాచార్య ప్రణీతమైన మహాశక్తి సంపన్న స్తోత్రమ్ ‘శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్’ ప్రచురించే మహత్కార్యాన్ని తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈయన రచించిన మహాగ్రంథం ‘నన్నేలు నాస్వామి’ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పురాణపండపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ' జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ' సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వెలువరించిన ఎన్నో సమ్మోహన గ్రంధాలకు భారీ డిమాండ్ వున్న విషయం అందరికీ తెలిసిందే. భారత దేశంలో ప్రముఖమైన పదహారు నృసింహ క్షేత్రాల మూలవిరాట్టుల మనోహర మంగళ దృశ్యాలతో, అందమైన వ్యాఖ్యాన వైఖరితో పరమ శోభాయమానంగా ఈ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ ప్రస్తుతం తీర్చిదిద్దుతున్నారు. శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28 వ తేదీన విడుదల చేస్తున్న ఈ పుస్తకాన్ని బీజేపీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు. -
పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు
శ్రీకాళహస్తి: శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శివోహమ్’ గ్రంథాన్ని మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరునికి బహూకరించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా ‘శివోహామ్’ గ్రంథం స్వామివారికి సమర్పించడం పట్ల శ్రీకాళహస్తి పండిత అధికార బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఆలయ పండితులు ఈ గ్రంథాన్ని రచించిన పురాణపుండ శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. తొలి ప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆర్కె రోజా అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో దివ్య మంగళకరమైన గ్రంథాన్ని ఆవిష్కరించి, భక్తులకు అందజేయడం తన పురాకృత జన్మసుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు తెలిపారు. శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘శివోహమ్’ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. రాజకీయాలలోనే కాకుండా భక్తి కార్యక్రమాల్లో కూడా ఎంతో శ్రద్ధగా ఎమ్మెల్యే రోజా పాల్గొనడం తమకు ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఆమెను అభినందించారు. ‘శివోహమ్’ గ్రంథాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలలో కూడా వేలకొలది భక్తులకు గ్రంథ రచయిత పురాణపుండ శ్రీనివాస్ పంపిణీ చేశారు. -
పురాణపండ శ్రీనివాస్‌కు ఘన సత్కారం
హైదరాబాద్: మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన కొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని హైదరాబాద్ త్యాగరాయగానసభలో అపురూప విలువల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం శ్రీనివాస్ మాట్లాడిన ప్రతీ పలుకూ సభికుల్ని తన్మయత్వానికి గురిచేశాయి. తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే.వి.రమణాచారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజులపాటు జరిగిన తెలంగాణా సాంస్కృతిక సప్తాహ వేడుకల ముగింపు ఉత్సవాన్ని శ్రీనివాస్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఉత్సవానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీమంత్రి సి.హెచ్.విద్యాసాగరరావు గౌరవ అతిధిగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. రమణాచారి వంటి ప్రతిభాశాలి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పురాణపండ శ్రీనివాస్ వంటి తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన రచయిత రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు మాట్లాడుతూ ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసి , సమర్ధ సేవలతో జాతీయ స్థాయిలో పేరుపొందిన రమణాచారి వంటి సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. భక్తి పారవశ్యపు మహా స్వరూప అత్యద్భుత గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ ఏడవసారి ప్రచురించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధాన్ని విద్యాసాగర్ రావు ఆవిష్కరించి, పురాణపండ శ్రీనివాస్ ప్రయత్నం, లక్ష్యం , దశ, దిశ, గమనం, గమ్యం అన్నీ అద్భుతంగా వుంటాయని శ్రీనివాస్ భాషలోని సొగసులు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయన్నారు. తెలుగు వాకిళ్ళలో ఇలాంటి నిస్వార్ధ ప్రతిభామూర్తిని ఎక్కడో గానీ చూడమన్నారు. ఈ వేడుకలో సంస్కృత పండితులు , ఆచార్యలు చలమచర్ల వేంకట శేషాచార్యుల్ని రమణాచారి తండ్రి రాఘవాచార్యుల స్మారక పురస్కారంతోను , ప్రముఖ లలిత సంగీత గాయకులు, లిటిల్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ రామాచారిని రమణాచారి స్ఫూర్తి పురస్కారంతోను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఏ.ఎస్.అధికారి కె.వి. రమణాచారి మాట్లాడుతూ- తన జన్మదిన వేడుకను ఇంత అందంగా , అద్భుతంగా నిర్వహించిన కళా జనార్ధనమూర్తిని అభినందించారు. సభా సమావేశాలకూ దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్ వంటి మానవవిలువల ప్రతిభాసంపన్నమైన ప్రజ్ఞ కలిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన వేడుకకు ముఖ్య అతిధిగా రావడంపట్ల తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంటూ విద్యాసాగర్‌రావు వంటి రాజకీయ వ్యక్తిత్వం మూర్తీభవించిన శిఖరం హాజరవవ్వడం పట్ల ప్రశంసలు వర్షించారు. ఈ వేడుకలో అందరినీ విస్మయపరిచే ప్రసంగం చేసి ఆకర్షించిన అరుదైన అతిధి పురాణపండ శ్రీనివాస్ ని సభపక్షాన విద్యాసాగర్ రావు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఇంత చక్కని సభను ఏర్పాటుచేసిన కళా జనార్ధనమూర్తిని జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, తెలంగాణా ప్రభుత్వ అధికారులు అభినందించారు. -
పురాణపండపై బాలకృష్ణ, కొర్రపాటి ప్రశంసలు
పవిత్ర హృదయం, నిశ్చలమైన భక్తితోనే ‘శ్రీనివాసో విజయతే’ వంటి అపురూప గ్రంథాలను వేలకొలది భక్తగణానికి నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి సమర్పించగలిగారని ‘ద్వారకా తిరుమల’ అర్చక బృందం ప్రశంసల వర్షం కురిపించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ‘శ్రీనివాసో విజయతే’ ఏడు వేల ప్రతులను ద్వారకా తిరుమల దేవస్థాన అధికారులకు అందజేశారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సాయి కొర్రపాటి ఉచితంగా పంపిణిచేశారు. కాగా, ఈ గ్రంథాలు చదివిన భక్తులు తిరుమలేశుడి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ 'శ్రీనివాసో విజయతే' గంధాన్ని రచించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ప్రచురించింది. గతంలో నందమూరి బాలకృష్ణ సమర్పణలో 500 అఖండ ఆంజనేయ చిత్రాలతో, యంత్ర మంత్రాత్మకంగా 'నేనున్నాను' మహాగ్రంథాన్ని వారాహి సంస్థ ప్రచురించింది. ఈ గ్రంథాన్ని కూడా పురాణపండ శ్రీనివాస్ రచించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్‌పై బాలకృష్ణ, సాయికొర్రపాటి ప్రశంసల వర్షం కురిపించారు. -
త్వరలో ‘శ్రీ పూర్ణిమ’ గ్రంథావిష్కరణ
మన జీవన విధానానికి, సమాజ సంస్కృతులకు ఉపయోగపడే ఎంతో మహోత్కృష్ణ గ్రంథరాశిని అందిస్తున్న విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞకేంద్రం ప్రచురించిన శ్రీ పూర్ణిమ విశేష గ్రంథం మనసు ప్రార్థన వైను అంటూ పరమ పవిత్రమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. సుమారు 800 పేజీలతో 150 వైదిక విశేషాంశాలతో రెండు వందల పైచిలుకు అరుదైన వర్ణ చిత్రాలతో మనస్సుని ఇట్టే ఆకట్టుకునే అందమైన వ్యాఖ్యానాలతో అందిన ఈ శ్రీపూర్ణిమ గ్రంథం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర నాయకురాలు ఆర్.కె.రోజా భక్తి రసాత్మక సమర్పణలో ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణ పండ శ్రీనివాస్ విలక్షణంగా అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకున్న ఈ శ్రీపూర్ణిమ గ్రంథాన్ని తిరుమల పూర్వ ప్రధానార్చకులు రమణదీక్షితులు, ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులతో పాటు అర్చక బృందాలు, వేదపండిత బృందాలు, మంగళాశాసనాలతో అభినందించడం విశేషం. పురాణ పండ శ్రీనివాస్ గ్రంథాల్లో సముజ్వలమైన సంస్కృతి, ప్రశంసాయోగ్యమైన సభ్యత, జీవన విధానాల లక్ష్యశుద్ధి, వైదిక మంత్ర శబ్దరాశుల ప్రహహాలు పుష్కలంగా ఉండటమే కాకుండా శ్రీనివాస్ వ్యాఖ్యాన వైఖరిలోని సొగసులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని రమణ దీక్షితులు ప్రశంసించారు. ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భారతీయుల భావనలో, జీవనంలో వైదిక తత్వమే ప్రతిబింబిస్తుందని, ఆ వైదిక తత్వం విరాట్ స్వరూపంగా శ్రీపూర్ణిమ గ్రంథమై సాక్షాత్కరించి రోజా వంటి రాజకీయనాయకురాలు ద్వారా ఎంతో భక్తితో సమర్పించబడటం చూసి ఆమె వినయ సంపత్తిని ఆవిష్కరిస్తోందని పేర్కొంటూ, ఓ ఎంతో భక్త్యావేశంతో పురాణ పండ శ్రీనివాస్ ఈ అపరూప గ్రంథాన్ని ప్రయోగజ్ఞతగా అందించి శ్రీవారి కృపకు నోచుకోవడం అర్చకుల హర్షానికి కారణభూతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పవిత్ర హస్తాల మీదుగా ఈ వారం ఆవిష్కరించనున్న ఈ గ్రంథాన్ని ఆర్.కె.సెల్వమణి, శ్రీమతి రోజా దంపతులు భక్తి శ్రద్ధలతో ముందుగానే శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమల అర్చకులకు తమ సహచర బృందం ద్వారా అందించడం ప్రత్యేక విశేషంగానే చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమం కసం అలుపెరుగక శ్రమిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని వర్గాల వారికి క్షేమదాయకం కావాలని ఈ గ్రంథం చివరలో శ్రీమతి రోజా ప్రకటించడం శాంతిదాయకగా ఉంది. -
శ్రీపూర్ణిమ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్
సాధకులకు అవసరమైన పవన దివ్యతత్వాల్ని, పరమ తత్వాల్ని తన్మయ భావంతో అందించడంలో అందవేసిన చెయ్యిగా తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నూతనంగా అందించిన పవిత్ర వైభవ మహాగ్రంథం `శ్రీపూర్ణిమ`. సుమారు 800 పేజీలతో పరమాత్మ లాలిత్యాన్ని అనేక స్తోత్రాలతో, అనేక లలిత లలిత పదబంధురాల వ్యాఖ్యానాలతో దర్శనమిస్తున్న ఈ `శ్రీపూర్ణిమ` మహాగ్రంథానికి రచనా సంకలనకర్త శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కాగా.. ఈ మహాగ్రంథ లావణ్యాన్ని సుప్రసిద్ధ నటి, నగరి శాసనసభ్యురాలు జబర్దస్త్ ఫేమ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్కే రోజా భక్తితాత్పర్యాలతో సమర్పించడం విశేషం. ఎక్కడున్నా నిత్యం ఉదయ సాయంకాలాలలో తన ఇష్టదైవమైన తిరుమల వేంకటేశ్వరునికి ప్రార్థనలు సమర్పించే రోజా ఇంతటి మహోజ్వల వైభవ గ్రంథానికి సమర్పకులుగా వ్యవహరించడం ఆసక్తిదాయంగానే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో రాష్ట్రం క్షేమదాయకంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ తాను ఈ మంగళ కార్యాన్ని అందిస్తున్నట్లు `శ్రీపూర్ణిమ` అట్ట వెనుక భాగంలో ప్రకటించడం రోజాకి వైఎస్ జగన్ పట్ల ఉండే గౌరవాన్ని ప్రజా సంక్షేమం పట్ల ఉండే శ్రద్ధను తెలియజేస్తోంది. భారత వైదిక వాజ్మయంలో ఉండే ప్రధాన అంశాలన్నింటినీ ఈ `శ్రీపూర్ణిమ`లో ఓ అద్భుత సారస్వత దృష్టితో భక్తులకు ఎంతో సన్నిహితంగా ఉండేలా పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని నిస్వార్థ పరమార్థ చింతనతో ప్రచురించడం వేలకొలది భక్తుల్ని ఆకర్షించే అంశం. సకల దేవతా సందర్శనం ఈ అపురూప గ్రంథమని చెప్పాలి. ప్రార్థనకు పారాయణకు ఉపయోగించే శ్రీరాగ రంజితమైన అనేక మహాగానాలు అక్షర రమ్యతతో పాఠకుడికి ఎంతో లావణ్య భరితంగా దర్శనమిస్తాయి. శ్రీ మహాసరస్వతి అవ్యాజ, అద్భుత, అపార, అపూర్వ అనుగ్రహం వల్లనే రోజా ఈ గ్రంథానికి సమర్పకురుఆలుగా బాధ్యతను మోయగలిగిందనేది ప్రస్ఫుటమయ్యే సత్యం. రాజకీయాల్లో, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే రోజా భక్తులకు ఈ మంత్ర గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా ఉచితంగా అందించడం ఈ రోజుల్లో విశేషంగా చెప్పుకోవాలి. ఈ అంశంలో ఆమెను అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమం కోసం సరిక్రొత్త రీతిలో దూసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ అఖండ గ్రంథాన్ని ఆవిష్కరింప చేయాలని సంకల్పించిన రోజా సెల్వమణి దంపతుల నిర్ణయానికి మనం సంతోషంగా పచ్చజెండా ఊపాలి. ఇప్పటికే వంద పైచిలుకు గ్రంథాలను రచించి, అద్భుతంగా ప్రచురించి ఆధ్యాత్మిక మార్గంలో విలక్షణ విశిష్ట భూమిక సంతరిచుకున్న పురాణపండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని మేలిమి విలువలతో, నాణ్యతా ప్రమాణాలతో అద్భుతంగా ప్రచురించడాన్ని పండిత పామర వర్గం చేత వన్స్‌మోర్ కొట్టిస్తుందనడంలో సందేహం లేదు. -
‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు
ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు రచించి తెలుగు పాఠకుల ప్రశంసలు అందుకున్న రచయిత పురాణపండ శ్రీనివాస్ గారు శ్రీ హనుమంతుని లీలలను ఆవిష్కరిస్తూ మరో గ్రంథాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. నేనున్నాను పేరుతో మంత్రరూపకమైన ఉపాసనా విశేషాలతో పాటుగా అపురూపమైన శ్రీరామచంద్రుని కథతో హనుమాన్ దివ్య గుణాలను వ్యక్తపరిచేలా ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు.. పూర్వపు ప్రధానార్చకులు రమణదీక్షితులు ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపించారు. ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావడంలో తమవంతు చేయూతను అందించిన వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటిని కూడా వారు ఈ సందర్భంగా ప్రశంసించారు. మరోవైపు కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామితో పాటుగా శృంగేరీ, కంచికామకోటి పీఠాధిపతులు కూడా ఈ గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్‌పై తమ వాత్సల్యాన్ని చూపించారు. పురాణపండ శ్రీనివాస్ నటులు ఎన్టీఆర్, బాలకృష్ణలతో పాటు దర్శకుడు రాజమౌళికి ఈ గ్రంథాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
త్వరలో తిరుమలేశునికి ‘పచ్చకర్పూరం’
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామిపై పచ్చకర్పూరం పేరిట ప్రశస్త్యమైన గ్రంథం ఆవిష్కృతం కానుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణ పండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రచించారు. ఇప్పటికే వివిధ రకాల గ్రంథాలను రచించిన పురాణపండ శ్రీనివాస్ తిరుమలేశుని వైభవంతో తాజా గ్రంథానికి రూపకల్పన చేశారు. ఈనెల 20వ తేదీ తరువాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన సతీమణి చేతుల మీదుగా తిరుమలలో గ్రంథ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.