తిరుమల వేంకటేశ్వరస్వామిపై పచ్చకర్పూరం పేరిట ప్రశస్త్యమైన గ్రంథం ఆవిష్కృతం కానుంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామిపై పచ్చకర్పూరం పేరిట ప్రశస్త్యమైన గ్రంథం ఆవిష్కృతం కానుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణ పండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రచించారు. ఇప్పటికే వివిధ రకాల గ్రంథాలను రచించిన పురాణపండ శ్రీనివాస్ తిరుమలేశుని వైభవంతో తాజా గ్రంథానికి రూపకల్పన చేశారు.
ఈనెల 20వ తేదీ తరువాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన సతీమణి చేతుల మీదుగా తిరుమలలో గ్రంథ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.