మోక్షజ్ఞ లాంచింగ్కు నిర్మాత ఫిక్స్ | Sai Korrapati to launch Nandamuri Mokshagna | Sakshi
Sakshi News home page

మోక్షజ్ఞ లాంచింగ్కు నిర్మాత ఫిక్స్

Published Fri, Jan 13 2017 11:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

మోక్షజ్ఞ లాంచింగ్కు నిర్మాత ఫిక్స్

మోక్షజ్ఞ లాంచింగ్కు నిర్మాత ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి.

పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. వారాహి చలన చిత్ర బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement