మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్ | Actor Avasarala Srinivas turns director | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్

Published Wed, Sep 11 2013 12:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Actor Avasarala Srinivas turns director

ఆష్టా చెమ్మా, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్. త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వర్థమాన నటుడు అవసరాల శ్రీనివాస్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. హాస్య ప్రధానంగా నడిచే కథకు హీరోతోపాటు ప్రముఖ హస్య నటులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన కథను రూపొందించినట్లు తెలిపారు.

 

తాను నిర్మించనున్న చిత్రానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ఆయన గతంలో ఈగ, అందాల రాక్షసి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ గోగినేనితో మరో చిత్రానికి పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆ చిత్రం కూడా ప్రధానంగా వినోదభరితంగా ఉంటుందన్నారు. ఆ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement