టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్.. ఆ మధ్య పిండం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈగల్‌లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. కిస్మత్‌లోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్మత్ మూవీ థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయలేదు. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లుగా ఉంటుందీ సినిమా. వారికైతే కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే?
ముగ్గురు స్నేహితులు బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చేస్తారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. రియా సుమన్‌తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. అభినవ్ గోమఠానికి సినీ రచయిత అవ్వాలన్నది కల. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన వల్ల ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిందనేదే కథ! ఇక ఈ చిత్రాన్ని శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు.
చదవండి: కావాలయ్యా.. సాంగ్‌పై దారుణ ట్రోల్స్.. మైండ్‌సెట్ మారాలన్న మిల్కీబ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment