Abhinav Gomatam
-
బిగ్‌బాస్ షోలో టాలీవుడ్ హీరో?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీల్లో లాంఛ్ అవనుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి.అన్లిమిటెడ్ ఫన్..ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు.. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ నాగ్ ప్రోమోలతో ఊదరగొడుతున్నాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల లిస్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నయని పావని, కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క.. ఇలా పలువురి పేర్లు నెట్టింట మార్మోగిపోతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరో పేరు కూడా వినిపిస్తోంది. అతడే కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం.ఆఫర్ ఓకే?మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా నీలో... వంటి సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్‌కు ఎవరూ సాటి రారు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్‌తో వచ్చిన మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా.. సినిమాలో హీరోగానూ నటించాడు. ఈ మధ్యే మై డియర్ దొంగ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా అతడిని బిగ్‌బాస్ టీమ్ సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగానే అభినవ్ ఆఫర్‌ను ఓకే చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే ఫన్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు! -
‘మై డియర్ దొంగ’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్.. ఆ మధ్య పిండం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈగల్లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. కిస్మత్లోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్మత్ మూవీ థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయలేదు. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లుగా ఉంటుందీ సినిమా. వారికైతే కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే? ముగ్గురు స్నేహితులు బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చేస్తారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. రియా సుమన్‌తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. అభినవ్ గోమఠానికి సినీ రచయిత అవ్వాలన్నది కల. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన వల్ల ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిందనేదే కథ! ఇక ఈ చిత్రాన్ని శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. చదవండి: కావాలయ్యా.. సాంగ్‌పై దారుణ ట్రోల్స్.. మైండ్‌సెట్ మారాలన్న మిల్కీబ్యూటీ -
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నయ్ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 29 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’మూవీ రివ్యూ
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. నేడు(ఫిబ్రవరి 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు కమెడియన్‌గా అందరిని నవ్వించిన అభినవ్.. హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మనోహర్ అలియాస్ మను(అభినవ్ గోమఠం) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పుడే మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించుకుంటాడు. పెద్దయ్యాక తనకు వచ్చిన కళనే వృత్తిగా మార్చుకుంటాడు. ఒక అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్సవుతుంది. అయితే డబ్బులు లేవని, పెయింటింగ్ ద్వారా వచ్చే ఆదాయం సంసారానికి సరిపోదని.. పెళ్లికి ఒకరోజు ముందు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆ అమ్మాయి లేచిపోతుంది. మరోవైపు మను క్లాస్మేట్, రిచ్ ఫ్యామిలీకి చెందిన రాహుల్(అలీ రెజా)..అతన్ని హేళన చేసి మాట్లాడుతాడు. దీంతో మను ఎలాగైనా బాగా సెటిల్ కావాలనుకుంటాడు. సొంత ఊళ్లోనే ఓ ఫ్లెక్సీ ఫ్రింటింగ్ షాపు పెట్టి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం అప్పు చేసి స్నేహితుడు శివ(మొయిన్ మహ్మద్) అదేగ్రామానికి చెందిన మరొక వ్యక్తి(నిజల్ గళ్ రవి)తో సహాయంతో ఊర్లో ఫెక్సీ ఫ్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆదిలోనే మనుకి ఎదురుదెబ్బ తాకుతుంది. కొన్ని కారణాల వల్ల అతని బిజినెస్ మధ్యలోనే ఆగిపోతుంది. అసలు మను ప్రింటింగ్ బిజినెస్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? పరువు కోసం మను ఆడిన ఓ అబద్దం అతన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టింది?మను బిజినెస్‌ను దెబ్బతీయాలని రాహుల్ ఎందుకు ప్రయత్నించాడు? చివరకు మను అనుకున్నట్లుగా ప్రింటింగ్ షాపు పెట్టి డబ్బులు సంపాదించాడా లేదా? ఉమాదేవి(వైశాలి రాజ్)తో మను ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మస్ట్ షేడ్స్ ఉన్నాయి రా?’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని నమ్ముకొని ముందుకు సాగితే విజయం వరిస్తుంది. కానీ చాలా మంది తమలోని టాలెంట్‌ని గుర్తించకుండా ఏవోవే ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా.. అసమర్థులుగా మిగిలిపోతున్నారు.అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించిన చిత్రమే ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’. టాలెంట్ ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులు పడే ఇబ్బందులు ఏంటి? ఆర్థికంగా బలంగా లేకపోతే సొంతవాళ్లతో పాటు ఇతరులు మనల్ని ఎలా చూస్తారు? తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో చర్చించాడు దర్శకుడు. టాలెంట్ ఉన్నవాడికి ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతమంది ఇబ్బంది పెట్టినా..ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనేది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. మను చిన్ననాటి ఎపిసోడ్‌తో చాలా సరదాగా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు లేచిపోవడం.. మను గురించి ఊరంతా మాట్లాడుకోవడం.. అవమానానికి గురైన మను ఫ్లెక్సీ ఫ్రింటింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే బిజినెస్ కోసం మను చేసే ప్రయత్నాలు.. ఫోటో షాప్ నేర్చుకోవడం.. ఈక్రమంలో ఉమాదేవితో ప్రేమాయణం ఇవ్వన్నీ రోటీన్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా.. చివరి 15 నిమిషాలు ఉత్కంఠంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్ చుట్టే తిరగడం, ఎమోషనల్ సన్నివేశాలు సాదా సీదాగా ఉండడం మైనస్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్తే ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ కొంతవరకు అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభినవ్ గోమఠం. ఆయన వేసే పంచులు బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇన్నాళ్లు తెరపై చూసిన దానికి పూర్తి భిన్నంగా అభినవ్ని చూపించాడు దర్శకుడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు మనోహర్ పాత్రలో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. సీరియస్ పాత్రల్లోనూ అభినవ్ చక్కగా నటిస్తాడనేది ఈ సినిమా ద్వారా తెలియజేశాడు. ఉమాదేవిగా వైశాలి రాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మెయిన్ చక్కగా నటించాడు. తెరపై చాలా చలాకీగా కనిపిస్తాడు. రవి పాత్రకు తమిళ నటుడు నిజల్ గళ్ న్యాయం చేశాడు. తరుణ్ భాస్కర్ ఎమ్మెల్యేగా గెస్ట్ రోల్ చేశాడు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో లావణ్య రెడ్డి పర్వాలేదు అనిపించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా ఈ సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన లాంగ్ స్పెషల్ అట్రాక్షన్. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
కథని నమ్మి చేశారనిపిస్తోంది
‘‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. ఈ చిత్రంతో తనకు మంచి సక్సెస్ రావాలి. టీజర్, ట్రైలర్ చూస్తే కథని నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తోంది. టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్నాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. అభినవ్ గోమఠం, వైశాలి రాజ్ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కాసుల క్రియేటివ్ వర్క్స్‌పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, మూవీ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా ఈ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు తొలి అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు తిరుపతి రావు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు భవాని కాసుల. -
మస్తు షేడ్స్ ఉన్నై రా టైటిల్ లాంచ్
-
హీరోగా తెలుగు కమెడియన్.. టైటిల్‌గా ఫేమస్ డైలాగ్
'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెబుతా', 'సేవ్ టైగర్' సినిమాలతో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించిన అభినవ్ గోమటం.. ఇప్పుడు హీరో అయిపోయాడు. 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో అతడు చెప్పిన పాపులర్ డైలాగ్ పేరునే ఇప్పుడు టైటిల్ చేసేశారు. ఈ చిత్రంలో అభినవ్ కథానాయకుడు. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ నిర్ణయించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వైశాలి రాజ్ హీరోయిన్. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) తిరుపతి రావు ఇండ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. హాస్యనటుడు, సహాయ నటుడిగా ప్రశంసలు అందుకున్న అభినవ్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారని చెప్పాడు. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఫిబ్రవరి చివర్లో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) -
కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం
నటి కల్పికా గణేష్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏడాది క్రితం నటుడు అభినవ్ గోమటంపై ఆమె ఎన్నో ఆరపణలు చేసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సోషల్ వార్ నడిచింది. అభినవ్ తనను వేధించాడని, తన పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడవలో చివరకు పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్పికా గణేష్ గురించి అభినవ్ గోమటం పలు వ్యాఖ్యలు చేశాడు. కల్పిక తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని.. ఆమెతో ఎలాంటి ఎఫైర్ లేదని అభినవ్ స్పష్టం చేశాడు. ఆమెతో పెద్దగా పరిచయం కూడా లేదని ఆయన ఇలా చెప్పాడు. 'మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసేవాళ్లం. అది కూడా ఎప్పుడో ఓ ఆరు నెలలకు ఒకసారి. అయితే, గతేడాది నవంబర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. ఆ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదు.. కానీ నీకు రావడం చాలా గొప్ప విషయం అంటూ అభినందనలు అని రిప్లై ఇచ్చాను. ఇక అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది. అవార్డు గురించి కూడా వినలేదు అంటావా..? నీకు అంత చులకనా? నీకు అంత ఇగోనా? అంటూ పెద్ద అగ్లీ ఫైట్ చేసింది. ఆ సమయంలో నేనొక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకున్నాను. ఆమె నన్ను పురుషాహంకారి అదీ ఇదీ అంటూ మెసేజ్‌లు చేస్తోంది. దీంతో నేను రిప్లై ఇవ్వడం ఆపేశాను. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే. అందరినీ ఇన్‌స్టాగ్రామ్‌లో తిట్టుకుంటోంది. ఆ అవార్డు గురించి నాకు తెలియదు అన్న పాపానికి... ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అందులో తప్పేముందని చాలామంది నెటిజన్లు ఆమెను తప్పుపట్టారు. అవార్డు గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలని కూడా ఆమె మెసేజ్‌లు పెట్టింది. అప్పుడు జరిగిన విషయం ఇదే.. అంతే కానీ ఆమెతో ఎలాంటి లవ్వూ లేదు.. గివ్వూ లేదు. నేను ఎలాంటి ప్రేమ కావ్యాలు కూడా రాయలేదు. అని అభినవ్ చెప్పాడు. గతంలో కల్పిక చిత్రపరిశ్రమలోని చాలామంది నటీనటులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్‌లో నిలిచిన విషయం తెలిసిందే. -
ముగ్గురి స్నేహితుల అదృష్టం
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘కిస్మత్’. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. అభినవ్ గోమఠంకి సినీ రచయిత అవ్వాలన్నది కల. రియా సుమన్‌తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. ఓ సంఘటనతో ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయింది అనేది ఈ చిత్రకథ అని యూనిట్ పేర్కొంది. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘కిస్మత్’ లాంటి చిత్రాలు మౌత్ టాక్ వల్లే హిట్టవుతాయి. ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అభినవ్ గోమఠం. ‘‘చక్కని ఫన్ ఫిల్మ్ ఇది’’ అన్నారు విశ్వదేవ్. ‘‘రాజు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. నరేశ్, అభినవ్, విశ్వలతో పాటు అందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకర్, సహనిర్మాత: భాను ప్రసాద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి. -
Save The Tigers Review: ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు నిర్మాతలు : మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి దర్శకత్వం : తేజ కాకుమాను క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం విడుదల తేది: ఏప్రిల్ 27, 2023(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఈ మధ్య కాలంలో ఓటీటీలలో ఎక్కువగా అడల్ట్ కంటెంటే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెబ్ సీరస్తో బోల్డ్ కంటెంట్ శృతిమించిపోతుంది. ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సిరీస్‌ని తెరకెక్కించాడు తేజ కాకుమాను. అదే ‘సేవ్ ద టైగర్స్. ‘యాత్ర’ఫేమ్ మహి వి. రాఘవ్ ఈ సిరీస్‌కి షో రన్నర్‌గా వ్యవహరించాడు. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. గంటా రవి(ప్రియదర్శి). రాహుల్(అభినవ్ గోమఠం), విక్రమ్(చైతన్య కృష్ణ).. ఈ ముగ్గురిని డ్రంక్ డ్రైవ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే విక్రమ్ కారుని సీజ్ చేస్తారు. అది అతని భార్య పేరుపై ఉంటుంది. కారు కావాలంటే కోర్టు కెళ్లి ఫైన్ కట్టాలని పోలీసులు చెబుతారు. ఈ విషయం తెలిస్తే తన భార్య గొడవ చేస్తుందని భావించిన విక్రమ్.. స్నేహితులు రవి, రాహుల్‌లతో కలిసి సీఐ(శ్రీకాంత్ అయ్యంగార్)దగ్గరకు వెళ్లి తమ బాధలను తెలియజేస్తూ.. ఎందుకు తాగాల్సి వచ్చిందో వివరిస్తారు. గంటారవి పాల వ్యాపారి. భార్య హైమావతి(సుజాత), పిల్లలలో కలిసి బోరబండలో నివాసం ఉంటాడు. హైమావతి బ్యూటీపార్లర్ రన్ చేస్తుంది. బోరబండను వదిలి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాలని తరచు భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. విక్రమ్ ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ పని చేస్తుంటాడు. అతని భార్య(దేవియాని శర్మ) లాయర్. ఫెమినిస్ట్. భర్త, కూతురిని పట్టించుకోకుండా ఎప్పుడూ కేసులంటూ కోర్టుల చుట్టే తిరుగుతుంది. ఆమెకు, విక్రమ్ తల్లికి అస్సలు పడదు. ఇక రాహుల్..రైటర్ కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాలీగా ఉంటాడు. అతని భార్య మాధురి(పావనీ గంగిరెడ్డి) డాక్టర్. మొదట్లో రాహుల్‌కి మద్దతుగా ఉన్న మాధురి.. కొన్నాళ్ల తర్వాత ఖాలీగా ఉన్నావంటూ విసుక్కుంటుంది. అంతేకాదు తన స్నేహితుడు డాక్టర్ నవీన్(రాజా చెంబోలు)కు క్లోజ్‌గా ఉంటుంది. ఇది రాహుల్‌కి నచ్చదు. ఈ ముగ్గురి పిల్లలు ఓకే స్కూల్లో చదువుతారు. దాని కారణంగా గంటా రవి, రాహుల్, విక్రమ్‌ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు ఈ ముగ్గురు కలిసి బార్లో బాగా తాగి రచ్చ చేస్తారు. అది ఓ టీవీ ప్రోగ్రామ్‌లో టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గంటా రవి మాటతీరు కారణంగా భార్య, పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఓ కమర్షియల్ యాడ్ కారణంగా విక్రమ్, అతని భార్యల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై రాహుల్ ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడు? ఆ అనుమానం ఎక్కడికి దారితీసింది? బార్లో గొడవకి, హీరోయిన్ హంస నందిని మిస్సింగ్‌కి ఎలాంటి సంబంధం ఉంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భార్యల వల్ల భర్తలు పడే ఇబ్బందుల నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ కూడా ఆ నేపథ్యంతో తెరకెక్కిన కథే. పెళ్లైన మగవారి కష్టాలను మెయిన్ పాయింట్‌గా తీసుకొని ఎంటర్టైనింగ్ పంథాలో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. ఇందులో మొత్తం మూడు జంటలు ఉంటాయి. వీరిలో మగవాళ్లంతా ఆడవారి వల్ల ఇబ్బంది పడుతున్నవారే. గంటా రవికి భార్యతో పాటు కూతురు,తల్లితో కూడా ఇబ్బందులే. ఇక విక్రమ్‌కు అయితే ఫెమినిస్ట్ అయిన భార్యతో పాటు అత్తగారి చేతిలో కూడా నలిగిపోతాడు. మరోవైపు రైటర్ కావాలని ఉద్యోగం మానేసిన రాహుల్‌కి భార్యతో పాటు ఇంటి పనిమనిషి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ కష్టాలను ఆరు ఎపిసోడ్లుగా చాలా వినోదాత్మకంగా, సహజసిద్దంగా చూపించారు. అంతేకాదు అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా చూపించాడు. భార్యభర్తల మధ్య గొడవలు వస్తే కలిసి సాల్వ్ చేసుకోవాలిని కానీ సైకిలాజిస్టుల వద్దకు వెళ్తే పరిష్కారం దొరకదని ఓ సన్నివేశం ద్వారా చూపించారు. అలాగే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులదే అని మరో సన్నివేశం ద్వారా చూపించారు. చేసే వృత్తిని గౌరవించాలని, పేరెంట్స్ పిల్లల కోసం ఎలాంటి బాధలు పడతారనేది గంటా రవి, అతని కూతురి పాత్ర ద్వారా చూపించారు. రాహుల్, మాధురిల ట్రాక్ చూస్తే.. భార్యను అలా అనుమానించాల్సింది కాదనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్, అతని భార్యల ట్రాక్ చూస్తే.. ఆమె విక్రమ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందనే బాధ కలుగుతుంది. మొత్తంగా ఈ మూడు జంటలను చూస్తే కొత్తగా పెళ్లైన మగవాళ్లు ఏదో ఒక జంటకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి అశ్లీలత(కొన్ని డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి) లేకుండా కామెడీగా సాగే ఇలాంటి వెబ్ సిరీస్ రాలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. పాల బిజినెస్ చేసే గంటా రవి పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తెలంగాణలో యాసలో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. రైటర్ కావాలనుకుని ఇంట్లోనే ఖాలీగా ఉండే వ్యక్తిగా అభినవ్ తనదైన నటనతో అదరగొట్టేశాడు. పొట్టను తగ్గించే సీన్, యాడ్ కోసం కంటెంట్ రాసే సన్నివేశాలలో అభివన్ నవ్వులు పూయించాడు. ఇక ఇంట్లో భార్య, ఆఫీసులో బాస్ మధ్య నలిగిపోయే విక్రమ్ పాత్రకి చైతన్య కృష్ణ న్యాయం చేశాడు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా జోర్దార్ సుజాత, , పావని గంగిరెడ్డి, దేవయాని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పనిమనిషిగా రోహిని, గంటా రవి తల్లిగా గంగవ్వ, విక్రమ్ బాస్‌గా హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఏంటీ బ్రో అల్లు అర్జున్ వస్తున్నారా?.. నిజమా.. నిఖిల్ షాక్..!
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈనెల 19న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నట్లు ఈ వీడియోలో హీరో నిఖిల్‌కు అభినవ్ చెప్పడం సరదాగా అనిపిస్తోంది. బన్నీ హాజరువుతున్నారని అభినవ్ చెప్పడంతో అఖిల్ సైతం అశ్చర్యానికి గురి కావడంలో అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియో అభినవ్, అఖిల్ సరదా సంభాషణ వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు విభిన్న రీతిలో చూపించారు. సరదా సంభాషణ సాగిందిలా.. అభినవ్:బ్రో నిఖిల్, కార్తికేయ మీరు ఇక్కడ ఎంటీ? నిఖిల్: జోర్డాన్‌కి షూటింగ్ కోసం వచ్చా అభినవ్: నువ్వు షూటింగ్ ఏంది భయ్యా? మీది ఏదో సినిమా రిలీజ్ ఉంది కదా. నిఖిల్: ఏదో కాదు 18 పేజెస్. అభినవ్:18 పేజెస్ నాకు తెలుసు తగ్గేదేలే. నిఖిల్: అది పుష్ప సినిమా డైలాగ్. 18 పేజెస్ సినిమా డైలాగ్ కాదు. అభినవ్: మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వస్తున్నారు నిఖిల్: ఏంటీ? మళ్లీ వస్తున్నారా? అల్లు అర్జున్ వస్తున్నారా? ఐ లవ్ యూ బ్రో అభినవ్: ఐ లవ్ యూ టూ బ్రో నిఖిల్: మరీ వెళ్దాం పదా..! అభినవ్: మీ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందా? స్క్రిప్ట్ మొత్తం ఇచ్చారా? నిఖిల్: హా బాగా వచ్చింది. 18 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చారు. అంటూ ఇద్దరు అక్కడి వెళ్లిపోయారు. ANDD!! The much awaited update is here!🔥 𝐈𝐂𝐎𝐍 𝐒𝐓𝐀𝐑 @alluarjun garu to grace the grand pre-release event of #18Pages on 𝐃𝐄𝐂 𝟏𝟗 !🤩#AAFor18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @adityamusic @shreyasgroup pic.twitter.com/6QZ8MpW8oz — 18Pages (@18PagesMovie) December 16, 2022 -
అభినవ్‌తో నటి కల్పిక మాటల యుద్ధం.. స్క్రీన్‌షాట్స్ వైరల్
నటి కల్పికా గణేష్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తుంది. అయితే కొద్దిరోజులుగా కల్పికా గణేష్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నటుడు అభినవ్ గోమటంతో కల్పికా సోషల్ వార్‌కు దిగింది. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవలె ఓ షోలో కల్పికకు బెస్ట్ సపోర్టింగ్ రోల్ కింద అవార్డు వరించిందట. దీనిపై అభినవ్ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడట. ఇప్పుడు ఈ అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తుంది. తన పనిని అభినవ్ అమానించాడని పేర్కొంటూ అతడు తనకు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా అభినవ్ గోమటం ఫ్రెండ్స్‌ని కూడా ట్యాగ్ చేస్తూ అతడితో సారీ చెప్పించాలంటూ సవాలు చేస్తుంది. అటు అభినవ్ కూడా .. కల్పికాకు క్షమాపణలు చెప్పేది లేదని, ఆమె కావాలనే తనను టార్గెట్ చేస్తుందంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని కూడా కల్పికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇలా మహిళలను తక్కువ చేసేలా మాట్లాడటమే కాకుండా గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కల్పికా డిమాండ్ చేస్తుంది. కాగా అభినవ్ గోమటం ఈ నగరానికి ఏమైంది, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.