
'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెబుతా', 'సేవ్ టైగర్' సినిమాలతో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించిన అభినవ్ గోమటం.. ఇప్పుడు హీరో అయిపోయాడు. 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో అతడు చెప్పిన పాపులర్ డైలాగ్ పేరునే ఇప్పుడు టైటిల్ చేసేశారు. ఈ చిత్రంలో అభినవ్ కథానాయకుడు. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ నిర్ణయించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వైశాలి రాజ్ హీరోయిన్.
(ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?)
తిరుపతి రావు ఇండ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. హాస్యనటుడు, సహాయ నటుడిగా ప్రశంసలు అందుకున్న అభినవ్‌లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారని చెప్పాడు. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తీస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఫిబ్రవరి చివర్లో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)
Comments
Please login to add a commentAdd a comment