
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీల్లో లాంఛ్ అవనుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి.
అన్‌లిమిటెడ్ ఫన్..
ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేదు.. అన్‌లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ నాగ్ ప్రోమోలతో ఊదరగొడుతున్నాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల లిస్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నయని పావని, కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క.. ఇలా పలువురి పేర్లు నెట్టింట మార్మోగిపోతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరో పేరు కూడా వినిపిస్తోంది. అతడే కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం.
ఆఫర్ ఓకే?
మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా నీలో... వంటి సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్‌కు ఎవరూ సాటి రారు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్‌తో వచ్చిన మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా.. సినిమాలో హీరోగానూ నటించాడు. ఈ మధ్యే మై డియర్ దొంగ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా అతడిని బిగ్‌బాస్ టీమ్ సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగానే అభినవ్ ఆఫర్‌ను ఓకే చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే ఫన్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment