పాటల పనిలో... | songs recording | Sakshi
Sakshi News home page

పాటల పనిలో...

Published Wed, Oct 2 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

పాటల పనిలో...

పాటల పనిలో...


 ఈగ, అందాలరాక్షసి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి.. వారాహి చలనచిత్రం పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నం3గా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
 
 శౌర్య, రాషి ఖన్నా జంటగా నటిస్తున్నారు. కల్యాణి కోడూరి స్వరాలందిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇటీవలే మొదలైంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సునీత తొలి పాటను ఆలపించారు.
 
 భిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఉంటుందని సాయి కొర్రపాటి తెలిపారు. సిల్లీ మాంక్స్ సినిమా సహ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement