andala rakshasi
-
లావణ్య అక్కా.. నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా?.. ఇప్పుడదే నిజమైంది!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ కామెంట్స్! అయితే గతంలో లావణ్యను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అదే ఇప్పుడు నిజమైందంటూ నెటిజన్స్ కూడా తెగ కామెంట్స్ చేశారు. ఆ సినిమా డైలాగ్ నిజమైంది అలాగే లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి అయినప్పటికీ.. యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అల్లు అరవింద్ మాటల్లాగే.. ఓ సినిమా డైలాగ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. గతంలో లావణ్య త్రిపాఠి నటించిన అందాల రాక్షసి సినిమాలో ఈ పెళ్లికి సరిగ్గా సెట్ అవుతుంది. అందులో కొంతమంది పిల్లలు మాట్లాడుతూ..' లావణ్య అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంటా కదా? అంటే పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా? అంటూ లావణ్యను అడుగుతారు. అందుకు లావణ్య కూడా అవునని చెబుతుంది. ఆ తర్వాత పిల్లలంతా గ్యాంగ్ లీడర్ కూడా వస్తున్నారంటూ అల్లరి చేస్తారు. ఆ సినిమా డైలాగ్ 2012లో వచ్చినా.. 2023లో అదే సీన్ రిపీట్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మన నిజ జీవితంలో జరగడం చాలా అరుదుగా చూస్తుంటాం కదా! కాగా.. అందాల రాక్షసి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 2012 ఆగస్టు 10 న విడుదలైంది. -
‘చి.ల.సౌ’ ఫస్ట్‌లుక్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘చి.ల.సౌ’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్నాడు. రుహని శర్మ హీరోయిన్గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు (మార్చి 18న) రిలీజ్ చేయాలని భావించారు. కానీ, అభిమానులకు ఉగాది కానుకగా ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ లాంచ్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. నిర్మాతలు త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
అందాల రాక్షసి నానితో చేద్దామనుకున్నా!
‘‘జనరల్‌గా నేను ఏ కథ రాసుకున్నా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. నాలుగు గోడల మధ్య కూర్చుని కథ రాసే అలవాటు లేదు. నలుగురితో డిస్కస్ చేస్తాను’’ అని హను రాఘవపూడి అన్నారు. ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. ఇప్పుడు నాని హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నేడు తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా హను రాఘవపూడి పలు విశేషాలు చెప్పారు. దర్శకునిగా నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ 2012లో విడుదలైంది. ఆ తరువాత యాక్షన్ లవ్‌స్టోరీ తెరకెక్కించాలని కథ రాసుకున్నా. ఆ కథతోనే తీయాలని ఓ ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. కానీ, కుదరలేదు. వాస్తవానికి ‘అందాల రాక్షసి’ కథను ముందుగా నానీకే చెప్పాను. కానీ, తనకు సూట్ కాదనుకున్నాడు. ఆ తర్వాత చెప్పిన రెండు కథలకు కూడా నాని పెద్దగా ఎగ్జయిట్ కాలేదు. చివరకు ఈ కథ నచ్చింది. ఈ కథలో ఓ వైవిధ్యమైన పాయింట్ ఉంది. గడచిన 20 ఏళ్లల్లో ఆ పాయింట్‌ని ఎవరూ టచ్ చేయలేదు. బలమైన ప్రేమకథతో సాగే ఈ చిత్రం వినోద ప్రధానంగా సాగుతుంది. ఇందులో నాని ఎక్కడా కనిపించడు. కృష్ణ పాత్రే కనిపిస్తుంది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడు కాబట్టి ‘జై బాలయ్య’ టైటిల్ వినపడింది కానీ, మేం ముందు నుంచీ ఆ టైటిల్ అనుకోలేదు. ఈ సినిమాకి సంగీత దర్శకునిగా ముందు రథన్నే అనుకున్నాం. కానీ, ఆ తర్వాత విశాల్ చంద్రశేఖర్‌తో చేయించాం. రథన్కీ, నాకూ మధ్య ఎలాంటి గొడవలూ లేవు. భవిష్యత్తులో తనతో సినిమా చేస్తాను. నిర్మాతలు అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సహకారం మర్చిపోలేనిది. రాజీపడకుండా నిర్మించారు. నేనే పని చేసినా ముందు ఆత్మసంతృప్తి లభించాలనుకుంటా. ఆ తర్వాత ప్రతిఫలం గురించి ఆలోచిస్తా. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పూర్తి సంతృప్తినిచ్చింది. త్వరలో ‘కవచం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నా. దానికి ఇంకా హీరోని నిర్ణయించలేదు. -
బన్నీని ఇంప్రెస్ చేసిన అందాలరాక్షసి
-
పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో
హైదరాబాద్ : టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచులర్ హీరోలు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. మంచు మనోజ్ ఈ నెల 20న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే హీరో అల్లరి నరేష్ కూడా మే 29న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా 'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నవీన్ చంద్రకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇక ఇతగాడు పెద్దలు నిర్ణయించిన యువతిని పెళ్లాడనున్నాడు. వధువు హైదరాబాద్‌కు చెందిన యువతిగా సమాచారం. త్వరలో నిశ్చితార్థం జరగనుందని, అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాదేనని నవీన్ చంద్ర సన్నిహితులు తెలిపారు. కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర ఓ వైపు తెలుగులో మరోవైపు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి సమయానికి ఆ సినిమాలన్ని పూర్తి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం స్వాతి ప్రధాన పాత్ర పోషిస్తున్న'త్రిపుర' చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది.ఇక తమిళ చిత్రం శివప్పుతో పాటు మరో కోలివుడ్ చిత్రానికి సైన్ చేశాడు. అంతేకాకుండా నవీన్ చంద్ర చేతిలో రెండు, మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
ముచ్చటగా మూడు సినిమాలు!
ఈ మధ్యకాలంలో నాని నటించిన చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే, అదేం నానీకి మైనస్ కాలేదు. ఎందుకంటే, నటుడిగా తను ఫెయిల్ కాలేదు. అందుకే, సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నానీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలు అంగీకరించారు. వాటిలో స్వప్నాదత్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. వాస్తవానికి ఇందులో రానా నటించాల్సి ఉంది. కానీ, ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో ఆ అవకాశం నానీకి వెళ్లింది. -
అమ్మాయిలంటే అస్సలు పడదు
తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో అందర్నీ ఆకట్టుకున్న నవీన్‌చంద్ర ప్యూర్ రొమాంటిక్ పాత్రలో నటించిన చిత్రం ‘నా రాకుమారుడు’. రీతూవర్మ కథానాయిక. సత్య దర్శకత్వంలో వజ్రంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో క్లాస్, మాస్‌తో కూడిన కొత్త లుక్‌లో కనిపిస్తాను. నా పాత్రకు అమ్మాయిలంటే అస్సలు పడదు. అలాంటి వాణ్ణి ఎలా ప్రేమలో పడ్డానా అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. లవ్, రొమాన్స్, కామెడీల కలబోత ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి -
పాటల పనిలో...
ఈగ, అందాలరాక్షసి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి.. వారాహి చలనచిత్రం పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నం3గా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. శౌర్య, రాషి ఖన్నా జంటగా నటిస్తున్నారు. కల్యాణి కోడూరి స్వరాలందిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇటీవలే మొదలైంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సునీత తొలి పాటను ఆలపించారు. భిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఉంటుందని సాయి కొర్రపాటి తెలిపారు. సిల్లీ మాంక్స్ సినిమా సహ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి
‘అందాలరాక్షసి’ ఫేం రాహుల్, రేష్మి మీనన్, జియా ప్రధాన పాత్రలుగా రూపొందుతోన్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ సినిమా ద్వారా చర్చించనున్నాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చేస్తున్నామని, ఈ నెల 15 వరకూ జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తవుతుందని, మిగిలివున్న నాలుగు పాటల్లో రెండు పాటలను వైజాగ్‌లో, రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని నిర్మాత చెప్పారు. రావురమేష్, షఫీ, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, రమాప్రభ, మధుమణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బీవీ అమర్నాథ్రెడ్డి, కూర్పు: ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ. -
వచ్చే ఏడాది చిన్మయితో నా పెళ్లి : రాహుల్
తెరవెనుక మరో ప్రేమకథ విజయవంతమైంది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్... గాయని, అనువాద కళాకారిణి చిన్మయి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారు. వీరిద్దరి పెళ్లికి ఇరువైపుల పెద్దల అంగీకార ముద్ర లభించింది. ఈ సందర్భంగా రాహుల్‌తో ఫోన్లో ముచ్చటిస్తే, చిన్మయితో తన ప్రేమ గురించి, పెళ్లి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ** కంగ్రాట్స్ రాహుల్... మీ ప్రేమకథను సక్సెస్ చేసుకున్నారు! థ్యాంక్స్ అండీ. ** చిన్మయితో మీ తొలి పరిచయం ఎప్పుడు? ‘అందాల రాక్షసి’ స్క్రీనింగ్‌కి తను వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ లావణ్య పాత్రకు తనే డబ్బింగ్ చెప్పింది. అప్పుడే తనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికే నేను తన వాయిస్‌కి వీరాభిమానిని. ‘ఏ మాయ చేశావె’లో సమంత పాత్రకు తను డబ్బింగ్ చెప్పిన తీరు చూసి ఫ్లాట్ అయిపోయాను. తను పాటలు కూడా బాగా పాడుతుంది. ** మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు. ముందు తన వాయిస్‌ని ఇష్టపడ్డాను. మా పరిచయం వృద్ధి చెందాక తనని ఇష్టపడ్డాను. ** చిన్మయిలో మీకు నచ్చిన అంశాలు? ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది. నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్. ** మీ ప్రేమని ఎప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు? మూడు నెలల క్రితమే ఇద్దరం ఓ నిర్ణయానికొచ్చాం. ప్రేమ గురించి, పెళ్లి గురించి అప్పుడే చర్చించుకున్నాం. ** పెద్దల్ని ఎలా ఒప్పించారు? ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు. ** ఇంతకూ మీ పెళ్లెప్పుడు? వచ్చే ఏడాది మార్చిలో ఉంటుంది. 2012... ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా బ్రేకొచ్చింది. 2013... లవర్‌గా సక్సెసయ్యాను. 2014లో పెళ్లితో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను. ** పెళ్లి తర్వాత చిన్మయి తన కెరీర్‌ని కొనసాగిస్తారా? పెళ్లికి, కెరీర్‌కి సంబంధం లేదు. ఇప్పుడు ఎలా కెరీర్ ఉందో, పెళ్లి తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. ** మరి మీ కెరీర్ ఎలా ఉంది? రామానాయుడిగారి సంస్థలో ‘నేనేం చిన్నపిల్లనా’ చేశాను. వచ్చే వారమే ఆ సినిమా విడుదలవుతుంది. ఇంకొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. నేనిక్కడ చాలా హ్యాపీ. అందుకే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాను కూడా!