
ముచ్చటగా మూడు సినిమాలు!
ఈ మధ్యకాలంలో నాని నటించిన చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే, అదేం నానీకి మైనస్ కాలేదు. ఎందుకంటే, నటుడిగా తను ఫెయిల్ కాలేదు. అందుకే, సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నానీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలు అంగీకరించారు. వాటిలో స్వప్నాదత్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. వాస్తవానికి ఇందులో రానా నటించాల్సి ఉంది. కానీ, ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో ఆ అవకాశం నానీకి వెళ్లింది.