
చి.ల.సౌ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ రవీంద్రన్, రుహని శర్మ, సుశాంత్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘చి.ల.సౌ’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్నాడు. రుహని శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు (మార్చి 18న) రిలీజ్ చేయాలని భావించారు. కానీ, అభిమానులకు ఉగాది కానుకగా ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ లాంచ్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. నిర్మాతలు త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment