హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి | A love story based on hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి

Published Tue, Oct 1 2013 11:42 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి

హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి

 ‘అందాలరాక్షసి’ ఫేం రాహుల్, రేష్మి మీనన్, జియా ప్రధాన పాత్రలుగా రూపొందుతోన్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది.
 
 హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ సినిమా ద్వారా చర్చించనున్నాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చేస్తున్నామని, ఈ నెల 15 వరకూ జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తవుతుందని, మిగిలివున్న నాలుగు పాటల్లో రెండు పాటలను వైజాగ్‌లో, రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని నిర్మాత చెప్పారు.
 
 రావురమేష్, షఫీ, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, రమాప్రభ, మధుమణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బీవీ అమర్‌నాథ్‌రెడ్డి, కూర్పు: ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement