Reshmi Menon
-
ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్ లవ్ స్టోరి’
త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’హైదరాబాద్ లవ్ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
కొత్త రకం...
‘‘సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ రెడ్డి. రామ్‌శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ ఈ నెల 17న రిలీజవుతోంది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సుదర్శన్ నా స్నేహితుడే. కాంటెంపరరీ ఇష్యూ స్ఫూర్తితో కథ రెడీ చేశాడు. కంటెంట్ పరంగా, కమర్షియల్‌గా డెప్త్ ఉన్న ఈ కథ విని ఆర్టిస్టులందరూ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. కథ, కథనం హైలెట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అదే విధంగా కమర్షియల్ సినిమాల్లో ఇదో కొత్త రకం అనే టాక్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
ఈ సినిమాతో హిట్ గ్యారంటీ
– పూరి జగన్నాథ్ ‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్ శంకర్‌కు హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో గోపీచంద్ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్ కుమార్ ఈ సినిమా చేశారు. మహిత్ పాటలు, రీ–రికార్డింగ్ హైలెట్. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్ శంకర్ కెరీర్లో ‘నేనో రకం’ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు. -
ఏ రకం?
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తె రకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సమాజంలో ఉన్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ చిత్రం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్నాం. సాయిరామ్ శంకర్ లేకుంటే ఈ చిత్రం చేసేవాళ్లం కాదు. శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన రాధికగారు తమిళంలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిత్ మంచి పాటలిచ్చాడు. మే మొదటి వారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తదితరులు మాట్లాడారు. -
అమ్మ అయిన రేష్మీమీనన్
ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు. అదేంటి ఆమె తల్లి అవ్వడం ఏమిటీ? ఇటీవలేగా నటుడు బాబీ సింహాతో ప్రేమ కలాపాలు అంటూ ప్రచారం హోరెత్తింది అంటారా? నిజమే. అది రియల్ లైఫ్ కథ. ఇది రీల్‌లైఫ్ కహానీ. ఇంతకీ విషయం ఏమిటంటే రేష్మీమీనన్ భయమా ఇరుక్కు అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక బిడ్డ కు తల్లిగా నటించడం విశేషం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసంతం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కోవైసరళ, నన్కడవుల్ రాజేంద్రన్, విజయ్ టీవీ.జగన్, లోల్లుసభ జీవా, భరణీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది వినోదం మేళవిం చిన వైవిధ్యభరిత థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పా రు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రేమను ఆవిష్కరించే చిత్రం భయమా ఇరుక్కు అని తెలిపారు. ఇందులో రేష్మీమీనన్ బిడ్డకు తల్లిగా నటించారని చెప్పారు. వీరిద్దరితోపాటు నాన్‌కడవుల్ రాజేంద్రన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ పయనించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నారు. అదేవిధంగా కోవైసరళ స్వామీజీగా కీలక పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు. చిత్రం తొలి ఘట్టం షూటింగ్‌ను కేరళలో పూర్తి చేసినట్లు, రెండో ఘట్టం షూటింగ్‌ను చెన్నైలో చిత్రీకరిస్తునట్లు వెల్లడించారు. ఇందులో ఒక ఇల్లు ముఖ్య భూమికగా ఉంటుందన్నారు. కేరళలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక ఇంటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రవాణా వసతులు లేని ఆ ఇంటిని చేరడానికి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. -
త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు
చెన్నై: మరో సినీ జంట ...త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 'ఉరుమీన్' చిత్రం హీరో హీరోయిన్ల ప్రేమకథకు కొద్ది నెలల్లో శుభం కార్డు పడనుంది. తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా, హీరోయిన రేష్మీ మీనన్... ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఒకే చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహాన్ని జరిపించేందుకు నిర్ణయించారు. రెండు కుటుంబాల పెద్దలు... వీరి పెళ్లికి అంగీకరించారని, ఆగస్ట్‌లో నిశ్చితార్థం , 2016 జనవరిలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు హీరో బాబీసింహా తన సన్నిహిత వర్గాలతో పంచుకున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై రేష్మీ మీనన్ కానీ, బాబీసింహా నుంచీ ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ పెళ్లికి రేష్మి తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేకపోయినా కూతురు అభీష్టం మేరకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పెద్దలు అంగీకారం ఉన్నా లేకపోయినా, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలన్న ఇద్దరి ప్రయత్నాలు తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించినట్టు సమాచారం. పిజ్జాతో తెరంగేట్రం చేసి జిగర్ తండ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నటుడు బాబిసింహా. విలక్షణ విలనీయంతో ఆకట్టుకున్న బాబీ ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు. బాబీ సింహా, , రేష్మీ జంటగా నటించిన ఉరుమీన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. బాబిసింహా,రేష్మీమీనన్ల తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను బాబిసింహా మిత్రుడు, పిజ్జా, జిగర్తండ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన భుజస్కంధాలపైన వేసుకుని...వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకు వచ్చారు. -
హైదరాబాద్ లవ్‌స్టోరి మూవీ స్టిల్స్
-
సమకాలీన అంశాలతో అందమైన ప్రేమకథ
ఇటీవలే ‘రోమియా’గా పలకరించిన సాయిరామ్ శంకర్ మరో కొత్త షూటింగ్లో బిజీగా ఉన్నారు. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తయారవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని సాయిరామ్ శంకర్ సరసన రేష్మీ మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ నెల 21 నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘‘అందమైన ప్రేమకథకు సమకాలీన అంశాలను జోడించి, సినిమాగా తీస్తున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. యై వంశీధర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రెండో షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఓ ప్రముఖ హీరోయిన్‌పై ప్రత్యేక గీతాన్ని కూడా తీయనున్నాం’’ అని చెప్పారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, మహత్ నారాయణ్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘కథ, కథనం, నా వేషభాషలు, పాత్రచిత్రణ-ఇలా ప్రతి అంశంలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ తీస్తున్న సినిమా ఇది’’ అని సాయిరామ్ శంకర్ నమ్మకంగా చెబుతున్నారు. -
సాయిరామ్ శంకర్ న్యూ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
సమ్‌థింగ్ స్పెషల్
‘‘నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిపోయే సినిమా ఇది. మంచి కథాకథనాలతో పాటు ప్రతిభావంతమైన బృందంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా, శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా, కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నానని శరత్‌కుమార్ చెప్పారు. అన్ని వర్గాలనూ అలరించే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, కాశీ విశ్వనాథ్, పృథ్వీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహత్. -
సాయిరామ్ శంకర్ న్యూ మూవీ స్టిల్స్
-
హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ స్టిల్స్
-
హైదరాబాద్ నేపథ్యంలో...లవ్‌స్టోరి
‘అందాలరాక్షసి’ ఫేం రాహుల్, రేష్మి మీనన్, జియా ప్రధాన పాత్రలుగా రూపొందుతోన్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ సినిమా ద్వారా చర్చించనున్నాం. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చేస్తున్నామని, ఈ నెల 15 వరకూ జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తవుతుందని, మిగిలివున్న నాలుగు పాటల్లో రెండు పాటలను వైజాగ్‌లో, రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని నిర్మాత చెప్పారు. రావురమేష్, షఫీ, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, రమాప్రభ, మధుమణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బీవీ అమర్నాథ్రెడ్డి, కూర్పు: ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ.