సమ్‌థింగ్ స్పెషల్ | Sairam Shankar and Reshmi Menon New Movie | Sakshi
Sakshi News home page

సమ్‌థింగ్ స్పెషల్

Published Tue, Sep 23 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

సమ్‌థింగ్ స్పెషల్

సమ్‌థింగ్ స్పెషల్

 ‘‘నా కెరీర్‌లో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిపోయే సినిమా ఇది. మంచి కథాకథనాలతో పాటు ప్రతిభావంతమైన బృందంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా, శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా, కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నానని శరత్‌కుమార్ చెప్పారు. అన్ని వర్గాలనూ అలరించే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, కాశీ విశ్వనాథ్, పృథ్వీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement