
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్ అల్లుడు, చిరు చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి సినీ ప్రవేశంపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత వరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ లుక్స్, మేకోవర్ చూస్తుంటే మాత్రం సినిమాల్లోకి రావటం ఖాయమనిపిస్తుంది.
తాజాగా కళ్యాణ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కళ్యాణ్ ను తెరకు పరిచయం చేసే బాధ్యతను మెగా ఫ్యామిలీ దర్శకుడు రాకేష్ శశి(జత కలిసే ఫేం), నిర్మాత సాయి కొర్రపాటి లకు అప్పగించారట. అంతేకాదు రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మెగాస్టార్ ఓకే అన్న వెంటనే సినిమాను పట్టాలెకక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఈప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా.. త్వరలోనే మెగా అల్లుగా ఎంట్రీకిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment