మెగా అల్లుడి సినిమా మొదలైంది | Kalyan Dhev Debut Movie Opening | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 10:18 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Kalyan Dev Movie Opeing - Sakshi

మెగాస్టార్‌ అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ మూవీ ఓపెనింగ్‌

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్ర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు నేడు (జనవరి 31) తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.  దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. ‘బాహుబలి’ చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement