ఘనంగా శ్రీజ వివాహ విందు | chiranjeevi daughter srija wedding reception | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీజ వివాహ విందు

Published Fri, Apr 1 2016 9:32 AM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

chiranjeevi daughter srija wedding reception

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి హోటల్ పార్క్ హయత్‌లో జరిగింది. వేడుకకు గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు సినీ, రాజయకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్ తో శ్రీజ వివాహం మార్చి 28న జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిపించడంతో ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బి. గోపాల్, గుణశేఖర్, హీరో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, పొట్లూరి వర ప్రసాద్, గోపీచంద్ దంపతులు, మంచు మనోజ్, మురళీమోహన్, జయసుధ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, అలీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ తదితర ప్రముఖులు రిసెప్షన్ కు హాజరైనవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement