ఘనంగా శ్రీజ వివాహం | Chiranjeevi's daughter Srija ties knot | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీజ వివాహం

Published Wed, Mar 30 2016 8:38 AM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

Chiranjeevi's daughter Srija ties knot

బెంగళూరు: సినీ నటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్తూరుకు చెందిన ఎన్నారై కళ్యాణ్ వరుడు. ప్రచారానికి దూరంగా సోమవారం ఉదయం మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. చిరంజీవి, వరుడు తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయాడు.

అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంచేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలను మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement