బెంగళూరులో శ్రీజ వివాహం | chiranjeevi daughter srija wedding in bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో శ్రీజ వివాహం

Published Thu, Mar 17 2016 7:49 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

బెంగళూరులో శ్రీజ వివాహం - Sakshi

బెంగళూరులో శ్రీజ వివాహం

హైదరాబాద్ : అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

 

అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement