srija wedding
-
ఘనంగా శ్రీజ వివాహ విందు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి హోటల్ పార్క్ హయత్‌లో జరిగింది. వేడుకకు గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు సినీ, రాజయకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్ తో శ్రీజ వివాహం మార్చి 28న జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిపించడంతో ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బి. గోపాల్, గుణశేఖర్, హీరో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, పొట్లూరి వర ప్రసాద్, గోపీచంద్ దంపతులు, మంచు మనోజ్, మురళీమోహన్, జయసుధ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, అలీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ తదితర ప్రముఖులు రిసెప్షన్ కు హాజరైనవారిలో ఉన్నారు. -
ఘనంగా శ్రీజ వివాహం
బెంగళూరు: సినీ నటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్తూరుకు చెందిన ఎన్నారై కళ్యాణ్ వరుడు. ప్రచారానికి దూరంగా సోమవారం ఉదయం మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. చిరంజీవి, వరుడు తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయాడు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంచేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలను మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్‌కు ఆహ్వానించినట్టు సమాచారం. -
బెంగళూరులో శ్రీజ వివాహం
హైదరాబాద్ : అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్‌లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. -
కళ్యాణ్-శ్రీజ జంటగా ఇలా..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి కబుర్లు రోజుకొకటి వార్తల్లో నిలుస్తున్నాయి. చిరంజీవికి కాబోయే చిన్నల్లుడు ఎట్టకేలకు వెలుగులోకి వచ్చాడు. నిన్న మొన్నటివరకూ శ్రీజకు కాబోయే వరుడు కళ్యాణ్ ఇతడేనంటా అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్-శ్రీజ జంటగా ఉన్న ఫొటోను ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. దీంతో శ్రీజ పెళ్లి వార్తను చిరంజీవి ఫ్యామిలీ అధికారికంగా కన్ఫామ్ చేసినట్టయింది. ఇక వరుడు కనుగంటి కళ్యాణ్ ఎన్నారై ఫ్యామిలీ అని తొలుతు వార్తలు వచ్చినా... అతని తల్లిదండ్రులు కెప్టెన్ కృష్ణ, జ్యోతి హైదరాబాద్‌కు చెందినవారేనని వధువరుల సన్నిహితులు తెలిపారు. కళ్యాణ్ బిట్స్ ఫిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 'కళ్యాణ్, శ్రీజలకు ఒకరిపై ఒకరికి చక్కని అవగాహన ఉంది. వియ్యం అందుకుంటున్న ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి' అని సన్నిహితులు వెల్లడించారు. కాగా ఈ వివాహం ఎక్కడ జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. పెళ్లి వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్నా, ఆ తర్వాత వేదిక మారినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో రెండు కుటుంబాలు గోప్యత పాటిస్తున్నాయి.