
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జతకలిసే ఫేం రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కళ్యాణ్ అరంగేట్రం కోసం మెగా ఫ్యామిలీ భారీ కసరత్తులే చేస్తోంది. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోంది.
కళ్యాణ్ సరసన హీరోయిన్ గా లై ఫేం మేఘా ఆకాష్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మేఘా ప్రస్తుతం నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన మేఘా ఆకాషే, కళ్యాణ్‌కు సరైన జోడి అని భావిస్తున్నారట మెగా టీం. ప్రస్తుతానికి మేఘా ఎంపికపై మెగా టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment