
‘బొమ్మోలే ఉన్నదిరా పోరి.. బొం బొంబాటుగుందిరా నారి.. లడ్డోలె ఉన్నదిరా కోరి.. లై లైలప్ప బుగ్గల్ది ప్యారి’ అంటూ ‘లై’ సినిమాలో మేఘా ఆకాశ్ అందచందాల్ని వర్ణించారు నితిన్. రచయిత కాసర్ల శ్యామ్ రాసినట్లు నిజంగానే మేఘా ఆకాశ్ బాగుంటుంది. ‘లై’ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ రెండోసారీ నితిన్‌తో జోడీకట్టారు.
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ ఓ సినిమాతో పాటు ప్రస్తుతం తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో మేఘా ఆకాశ్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారట. ‘జతకలిసే’ ఫేమ్ రాకేశ్ శశి దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రబృందం మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపైనా దృష్టి సారించారట.
Comments
Please login to add a commentAdd a comment