కోలవరి పాటతో ఒక్కసారిగా నేషనల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ యంగ్ మ్యూజిషియన్ ప్రస్తుతం సౌత్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందుకే సౌత్ ఇండియన్ టాప్ హీరోలు కూడా అనిరుధ్ పాటలకు స్టెప్పులేయాలని ఎదురుచూస్తున్నారు.
అయితే ఎంత బిజీగా ఉన్న మ్యూజిషియన్ అయినా సూర్య లాంటి టాప్ హీరో సినిమాకు ఛాన్స్ వస్తే కాదనరు. కానీ అనిరుధ్ మాత్రం ఆ సాహసం చేశాడు. సూర్య, హరి కాంబినేషన్లో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలకు సీక్వెల్గా సింగం-3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మూడో భాగానికి మాత్రం అనిరుధ్తో మ్యూజిక్ చేయించాలని భావించారట చిత్రయూనిట్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, సింగం 3 సినిమాకు మ్యూజిక్ ఇవ్వలేనంటూ రిజెక్ట్ చేసేశాడు. దీంతో మరోసారి దేవీ శ్రీ నే సింగంకు సంగీతం అందించే ఛాన్స్ ఉందంటున్నారు.
సూర్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో '24' సినిమాలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత నవంబర్ 15 నుంచి సింగం 3 షూటింగ్ ప్రారంభించనున్నారు.
సూర్య సినిమాకు నో చెప్పాడు
Published Sat, Sep 12 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement
Advertisement