కాసులు తెచ్చే సినిమా కావాలి
తమిళ్తో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సౌత్ హీరో సూర్య. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసే సూర్య మాస్ క్యారెక్టర్స్ తోనూ అదరగొడుతున్నాడు. అయితే కొద్ది రోజులుగా వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ మ్యాన్లీ స్టార్, భారీ కలెక్షన్లు సాధించే సినిమాలను మాత్రం అందించలేకపోతున్నాడు.
తన తోటి హీరోలు 50 కోట్లు, 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే భారీ వసూళ్లను సాధించటంలో సూర్య వెనకపడిపోతున్నాడు. ఇటీవల విడుదలైన 24 బిగ్ హిట్ అనిపించుకున్నా, భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. దీంతో పోటీలో నిలబడేందుకు ఓ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య.
ప్రస్తుతం తనకు వరుస హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో సింగం సినిమాకు రెండో సీక్వెల్గా తెరకెక్కుతున్న ఎస్ 3లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలను కమర్షియల్ హిట్స్గా మలిచేందుకు కష్టపడుతున్నాడు ఈ విలక్షణ నటుడు.