ప్రకృతిని, మనిషిని ప్రేమించమనే 'జనతా గ్యారేజ్'
మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా జనతా గ్యారేజ్. వరుస హిట్స్తో సూపర్ ఫాంలో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో రికార్డ్లు తిరగరాయలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా భారీ కాస్టింగ్తో ఇంట్రస్టింగ్ స్టోరి లైన్తో తెరకెక్కిన జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కావటంతో ఆ అంచనాలను కంట్రోల్ చేస్తూ.. రూపొందించిన ఈ ట్రైలర్లో దాదాపు సినిమా స్టోరి లైన్ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ప్రకృతిని ప్రేమించే ఆనంద్ (ఎన్టీఆర్), మనుషుల్ని ప్రేమించి పెద్ద మనిషితో కలిసి సమాజం కోసం ఎలా పాటు పడ్డారన్నదే జనతా గ్యారేజ్ కథగా కనిపిస్తోంది. కొంత కాలంగా మాస్ మూసను పక్కన పెట్టి క్లాస్గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. అయితే మాస్ ఆడియన్స్ తన నుంచి ఆశించే డాన్స్లు.. పంచ్ డైలాగ్లు మాత్రం బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివలు ఇద్దరు హ్యట్రిక్ మీద కన్నేశారు.