
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో స్టార్ట్ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు వినిపిస్తోంది. మరి.. ఎన్టీఆర్‌తో జోడీ కట్టే చాన్స్ అనన్యకు దక్కుతుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది అనన్య పాండే. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
చదవండి: ఎన్టీఆర్‌కు విలన్‌గా కమల్ హాసన్ !.. ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా..
నన్ను క్షమించండి..అభిమానులకు ఎన్టీఆర్ ఎమోషనల్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment