'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్‌పై కల్యాణ్‌ రామ్‌ ప్రశంసలు | Kalyan Ram Comments On Jr NTR | Sakshi
Sakshi News home page

'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్‌పై కల్యాణ్‌ రామ్‌ ప్రశంసలు

Published Fri, Sep 27 2024 6:37 PM | Last Updated on Fri, Sep 27 2024 7:24 PM

Kalyan Ram Comments On Jr NTR

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్‌ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్‌ రామ్‌ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.

దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్‌) యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్‌ రామ్‌ చెప్పారు.

అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్‌  కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.

నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని  డిస్ట్రిబ్యూట్‌ చేసిన దిల్‌రాజు కూడా ఈ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది.  'వన్‌ మ్యాన్‌ షోతో సినిమాను తారక్‌ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్‌ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్‌ రాజు అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement