మయూరిలా మరో సక్సెస్‌ | Long awaited crime thriller 'Dora' which has Nayanthara in lead | Sakshi
Sakshi News home page

మయూరిలా మరో సక్సెస్‌

Published Wed, Mar 8 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

మయూరిలా మరో సక్సెస్‌

మయూరిలా మరో సక్సెస్‌

– నిర్మాత మల్కాపురం
‘‘తమిళంలో ‘డోర’ చిత్రం ఆడియో వేడుక చేయలేదు. తెలుగు పాటల వేడుకలో నేను తొలిసారి స్టేజ్‌ ఎక్కుతున్నా. ఈ నెల 31న తెలుగు, తమిళంలో మా చిత్రం విడుదలవుతుంది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ చేయాలి’’ అన్నారు దర్శకుడు దాస్‌. నయనతార లీడ్‌ రోల్‌లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళంలో జబర్, తెలుగులో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు.

వివేక్, మెరిన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ – ‘‘నటనకు నయనతార పెట్టింది పేరు. ‘మయూరి’ చిత్రంలాగా ఈ చిత్రంతో నయన్‌ మరో సక్సెస్‌ సాధిస్తారు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నాం. తెలుగు సంగీతం విషయంలో యశోకృష్ణ ఎంతో సపోర్ట్‌ చేశారు. ‘సింగం 3’ తర్వాత మా బ్యానర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా ‘డోర’ అవుతుంది’’ అన్నారు. వివేక్, మెరిన్, దర్శకులు ఎన్‌.శంకర్, జి.అశోక్, దశరథ్, పాటల రచయిత చంద్రబోస్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement