ప్రియుడికి ప్రేమతో.. | Nayantara's love affair with Vignesh siva | Sakshi
Sakshi News home page

ప్రియుడికి ప్రేమతో..

Published Fri, Jul 28 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

ప్రియుడికి   ప్రేమతో..

ప్రియుడికి ప్రేమతో..

తమిళసినిమా: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే. నయనతార ఇప్పుడీ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్‌ నటుల మాదిరి జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్‌. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన టాప్‌ హీరోయిన్‌ నయనతార.

ఈమె నటించిన  హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం మాయ అనూహ్య విజయాన్ని సాధించింది.అయితే ఆ తరువాత నటించిన డోరా నిరాశపరచింది. అయినా ఈ స్టార్‌ నటి మార్కెట్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయుదీర్‌ కాలం, నేర్‌వళి చిత్రాలతో పాటు తాజాగా అంగీకరించిన ఖోఖో అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్‌ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా నయనతార వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు ఘోరంగా ఓటమిని చవి చూశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం చాలా కాలంగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.

యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమ ఆయనతో సహజీవనం సాగించే స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ విషయం గురించి ఇద్దరూ మౌనం వహిస్తున్నా, వీరి మధ్య ప్రేమ కొనసాగుతోందనడానికి చాలా కారణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడికి అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా కొనిచ్చారట. ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.నయనా మజాకా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement