నువ్వే నా బంగారం! | Vignesh Shiva wishes to nayanathara | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 18 2017 8:37 PM | Last Updated on Sat, Nov 18 2017 8:37 PM

Vignesh Shiva wishes to nayanathara - Sakshi

నయనతార.. నువ్వే నా బంగారం అంటున్నాడు ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివ. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నట్టు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ’నాను రౌడీదాన్‌’ చిత్ర షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. అసలు రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారనే వారూ లేకపోలేదు. ఈ ప్రచారాన్ని ధ్రువీకరించేవిధంగా ఈ మధ్య విఘ్నేశ్‌శివ పుట్టిన రోజు సందర్భంగా నయనతార అతనితో న్యూయార్క్‌ వెళ్లి.. ఘనంగా సెలబ్రేషన్స్‌ జరిపింది. ఈ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇక, తాజాగా నయనతార శనివారం పుట్టినరోజు జరుపుకుంది. చిత్ర ప్రముఖులు, అభిమానులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్‌శివ కూడా ఒక ట్వీట్‌ చేశాడు. ’నేను చూసిన నిజమైన మంచి అమ్మాయి నువ్వు. నీ ధైర్యాన్ని ఎప్పటికీ సడలనివ్వకు. నయనతార అంటే ఏమిటో నలుగురికి చాటేలా నీ విజయగాథ కొనసాగించు. నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ, గౌరవం ఉంటాయి. నువ్వే నా బంగారం’ అని పేర్కొంటూ తను నయనతారతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. 

తను తాజా చిత్రం ’అరమ్‌’  మంచివిజయాన్ని సాధించడంతో ఆనందంలో తేలిపోతున్న నయనతార ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. నయన్‌- శివకార్తికేయన్‌ జంటగా  తెరకెక్కిన ’వేలైక్కారన్‌’ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక తెలుగులోనూ చిరంజీవికి జంటగా సైరా, బాలకృష్ట సరసన జయసింహా చిత్రాల్లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement