... అని చదవగానే విఘ్నేష్ శివన్, నయనతారల లవ్ లైఫ్ గురించి ఏదో చెప్పబోతున్నాం అనుకుంటున్నారా? విషయం దాని గురించి కాదు. అయినా ఈ మధ్య విఘ్నేశ్ శివన్ బర్త్‌డే సందర్భంగా నయన, బర్త్‌డే బాయ్ కలసి దిగిన ఫొటోలు చూస్తే, ఎవరూ చెప్పకుండానే ఈ ఇద్దరి బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉందని ఊహించేయవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే.. ఓ సైకో థ్రిల్లర్ మూవీలో నయనతార నటించనున్నారనే వార్త ఆ మధ్య వచ్చిన విషయం తెలిసిందే. ‘అవును... అది నిజమే’ అని అధికారికంగా ప్రకటించారు.
‘ఈరమ్’, ‘వల్లినమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అరివళగన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మాయ’, ‘అనామిక’, ‘డోర’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు నయనతార. ప్రస్తుతం చేస్తున్న వాటిలో ‘ఇమైక్క నొడిగళ్’. ‘కొలైయుదిర్ కాలమ్’ కూడా ఆ తరహా చిత్రాలే. ఇప్పుడు అరివళగన్ డైరెక్షన్‌లో చేయనున్నది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీయే. చూడబోతుంటే నయనతార కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ.
Published Tue, Sep 26 2017 2:18 AM | Last Updated on Tue, Sep 26 2017 2:22 AM
Advertisement
Advertisement