ఆర్‌బీఐ రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా నోట్లను వదిలించేందుకు ప్రజలు రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క‍్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు 72 శాతం క్యాష్ ఆన్ డెలివరీలు (సీవోడీ) వచ్చినట్లు తెలిపింది. సీవోడీ వినియోగించుకున్న కష్టమర్లు తమకు రూ.2,000 నోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?)
ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ సూచింది. ఆర్‌బీఐ ప్రకటన నేపధ్యంలో ప్రజలు రూ. 2000 నోట్లను వదిలించుకునేందుకు పెట్రోల్ బంకులకు బారులు తీరారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!)
since friday, 72% of our cash on delivery orders were paid in ₹2000 notes pic.twitter.com/jO6a4F2iI7
— zomato (@zomato) May 22, 2023
ఈ కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తున్నారు. గోల్డ్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. పెట్రోల్ బంకులకు, బంగారం షాపులకు, బారులుతీరారు. వెరసీ 11 వారాలలో తొలిసారి దేశంలో బంగారం అమ్మకాలు భారీ ఎత్తున జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
చదవండి👉 అయ్యో పాపం! ఐటీ ఉద్యోగులు.. అత్యంత చెత్త సంవత్సరంగా 2023!
Comments
Please login to add a commentAdd a comment