Rs 6 crore
-
భారీ ఎత్తున బంగారం, కరెన్సీ పట్టివేత
న్యూఢిల్లీ: రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భారీ ఎత్తున బంగారాన్ని, అక్రమ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ జోనల్ యూనిట్ నల్లధనం,బంగారం అక్రమ రవాణా వెలికితీతలో భాగంగా దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 20.64 కిలోల బంగారాన్ని, 6.44 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. పాత ఢిల్లీ ప్రాంతంలో రాజేష్ గుప్తా కి చెందిన ఒక దుకాణంనుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంకజ్ కుమార్ అనే వ్యాపారి అక్రమ బంగారాన్ని అమ్మినట్టుగా డీఆర్ఐ అధికారి తెలిపారు. ఇరువురినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ తరలించామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. 995 స్వచ్ఛత 1 కిలో బరువు తూగే 20విదేశీ బార్లనుతో పాటు నగదు మొత్తం మొత్తం విలువ సుమారు రూ 12.91 కోట్లు ఉంటుందని ప్రకటించారు. బ్లాక్ మనీ, అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ బంగారానికి వ్యతిరేకంగా తమ డ్రైవ్ తో కొనసాగుతుందని తెలిపారు. కాగా గత నెల, డిఆర్ఐ ఢిల్లీ జోనల్ యూనిట్ రూ 2,000 కోట్ల విలువైన సుమారు 7,000 కిలోగ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
జైట్లీ ఆస్తి ఎంతో తెలుసా?
గతంలో అందరికంటే అధిక ఆస్తులతో అగ్రస్థానంలో నిలిచిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ ఏడాది క్షీణించిందట. ఈ వివరాలను అధికారిక పీఎంవో వెల్లడి చేసింది. 2016 ఆర్థిక సం.రానికి గాను జైట్లీ ఆస్తులు విలువ (8.9 శాతం) 6 కోట్లకు క్షీణించిందని తెలిపింది. 2014-15లో రూ 67. 01 కోట్లుగా ఉన్న జైట్లీ వ్యక్తిగత సంపద , 2015-16 లో రూ 60.99 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆయన చర, స్థిర ఆస్తుల డేటా వివరాలను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అధికారికంగా వెల్లడించారు. జైట్లీకి, ఆయన భార్యకు ఉమ్మడి ఆస్తిగా ఆరు(ఢిల్లీ, గుర్గావ్, హర్యానా పంజాబ్ లోని అమృతసర్, గుజరాత్ లోని గాంధీనగర్) రెసిడెన్షియల్ ఆస్తులు ఉన్నాయి. దీంతో పాటూ ఢిల్లీలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని డేటా వెల్లడించింది. డేటా వెల్లడించిన వివరాల ప్రకారం 2016 ఆర్థిక సంవత్సరానికిగాను జైట్లీ బ్యాంకు బ్యాలెన్స్ గత ఏడాది రూ 3.52 కోట్ల నుంచి, రూ .1 కోటి వరకు తగ్గింది. . నాలుగు సేవింగ్స్ ఖాతాలున్నాయని (హెచ్‌డీఎఫ్‌సీలో మూడు, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా లో ఒకటి ). 15కేజీల వెండి,(5.54 కోట్లు) 5.6 కిలోల(1.35కోట్ల) బంగారం , రూ .45 లక్షలు వజ్రాభరాణాలు ఆయన సంపదలో భాగం. రెండు మెర్సెడెజ్ బెంజ్, ఒక హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, ఉండగా ఈ సంవత్సరం 86 లక్షల బీఎండబ్ల్యూ కారుతో కలిపి అయిదుకు చేరాయి. దీంతోపాటుగా డీసీఎం శ్రీరాం సంస్థలో 8 కోట్లు ఎంప్రో ఆయిల్స్ కంపెనీల్లో 9 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. -
డివైడ్ టాకొచ్చినా 'కృష్ణాష్టమి' జోరు!
చెన్నై: హీరో సునీల్ తాజా సినిమా 'కృష్ణాష్టమి' తొలి వీకెండ్లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలికాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న సునీల్ ఎన్నో ఆశలతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు. కొంతవరకు డివైడ్ టాక్ వినిపించింది. రివ్యూల్లోనూ పెద్దగా ప్లస్ మార్కులు పడలేదు. అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో 'కృష్ణాష్టమి' సత్తా చాటుతూ.. ఈ రూ. 6 కోట్ల వరకు వసూలు చేసింది. 'మాస్ ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటున్నది. దీంతో వసూళ్లు బాగున్నాయి. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో రూ. 6 కోట్లు రాబట్టింది. ఇదే ఊపు మరికొన్ని రోజులు కొనసాగితే.. తొలివారం కలెక్షన్ల విషయంలో ఈ సినిమా విజయవంతమైనట్టే' అని ట్రేడ్ అనాలిసిస్ట్ త్రినాథ్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. దర్శకుడు వాసువర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గల్రానీ, దింపల్ చోపడ్ కథానాయికలుగా నటించారు. దిల్ రాజు నిర్మాత. -
రేటు రెండింతలు!
మార్కెట్ ఉన్నప్పుడే పారితోషికం పెంచాలి... లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే బెట్టు చేయాలి... కొంతమంది తారలు ఫాలో అయ్యే సూత్రాలివి. తాజాగా ఈ జాబితాలో కంగనా రనౌత్ కూడా చేరిపోయారు. వరుస విజయాలతో పట్టరానంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంగనా, తన మార్కెట్‌ని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటివరకూ ఆమె ఒక సినిమాకి దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకునేవారట. కానీ ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ రెండు భాగాలు.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు కాబట్టి, పారితోషికం పెంచాలనుకున్నారట. మూడు కోట్లకు అదనంగా ఇంకో అర కోటి, ఒక కోటీ కాదు.. ఏకంగా రేటు రెండింతలు చేసేశారట. ఒక సినిమాకి ఆరు కోట్లు ఇస్తేనే అంగీకరిస్తా, లేకపోతే వేరే కథానాయికను చూసుకోండి అని నిర్మొహమాటంగా చెబుతున్నారని హిందీ రంగంలో ఓ వార్త ప్రచారమవుతోంది. కొంచెం అటూ ఇటూగా ఐదు కోట్లకు ఒప్పుకోండి మేడమ్ అంటే.. అలా అడగడానికి ఎంత ధైర్యం అన్నట్లు నిర్మాతల వైపు గుర్రుగా చూస్తున్నారట కంగనా. ఏం చేస్తాం? అంతా మార్కెట్ మహిమ అని నిర్మాతలు చెప్పుకుంటున్నారని భోగట్టా. చివరికి కంగనా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట. -
రూ.6 కోట్లతో చిట్టీల నిర్వాహకుడు పరారీ
నరసరావుపేట టౌన్ (గుంటూరు): చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ వ్యక్తి కుటుంబం సహా పరారైన సంఘటన మంగళవారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం యలమంద పంచాయతీ శ్రీనివాసనగర్‌లోని కావేరీ టవర్స్‌లో నివాసం ఉంటున్న కత్తుల రాంబాబు ప్రకాష్‌నగర్‌లో అనధికారికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతని వద్ద అనేకమంది మధ్య తరగతి వర్గాల వారు చిట్స్ వేశారు. అధిక వడ్డీ ఆశచూపి లక్షలకు లక్షలు అప్పులు కూడా చేశాడు. కొంతకాలంగా చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకపోవటం, చిట్స్ కాలపరిమితి తీరినప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లించకపోవటం రాంబాబు ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు నెల రోజుల నుంచి డబ్బుల కోసం అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన రాంబాబు, అతని భార్య ఇందిర, ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి వెళ్లారు. వారం రోజులు గడుస్తున్నా తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన బాధితులు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాంబాబు నివాసం ఉండే పరిధి తమది కాదని రూరల్ పరిధిలోనిదంటూ అక్కడ పోలీసులు చెప్పటంతో అందరూ రూరల్ స్టేషన్‌కు వచ్చారు. సుమారు 40 మంది బాధితులు లిఖితపూర్వకంగా ఒక్కొక్కరికీ రావాల్సిన నగదు వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.4 కోట్లమేర రాంబాబు బాధితుల వద్ద నుంచి చిట్టీలు, అధికవడ్డీల పేరుతో తీసుకున్న నగదు ఇవ్వాల్సి ఉంటుందని, చిట్టీల కార్యాలయాన్ని, నివాసం ఉండే ఫ్లాట్‌ను కూడా విక్రయించాడని బాధితులు చెబుతున్నారు. కొన్ని ప్రై వేటు సంస్థలు నిర్వహించే చిట్స్‌లో సభ్యుడిగా చేరి ముందుగానే ఆ చీటీలను పాడుకొని మొత్తం సొమ్ముతో పథకం ప్రకారం నిందితుడు పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.