జైట్లీ ఆస్తి ఎంతో తెలుసా?
గతంలో అందరికంటే అధిక ఆస్తులతో అగ్రస్థానంలో నిలిచిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ ఏడాది క్షీణించిందట. ఈ వివరాలను అధికారిక పీఎంవో వెల్లడి చేసింది. 2016 ఆర్థిక సం.రానికి గాను జైట్లీ ఆస్తులు విలువ (8.9 శాతం) 6 కోట్లకు క్షీణించిందని తెలిపింది. 2014-15లో రూ 67. 01 కోట్లుగా ఉన్న జైట్లీ వ్యక్తిగత సంపద , 2015-16 లో రూ 60.99 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆయన చర, స్థిర ఆస్తుల డేటా వివరాలను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అధికారికంగా వెల్లడించారు. జైట్లీకి, ఆయన భార్యకు ఉమ్మడి ఆస్తిగా ఆరు(ఢిల్లీ, గుర్గావ్, హర్యానా పంజాబ్ లోని అమృతసర్, గుజరాత్ లోని గాంధీనగర్) రెసిడెన్షియల్ ఆస్తులు ఉన్నాయి. దీంతో పాటూ ఢిల్లీలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని డేటా వెల్లడించింది.
డేటా వెల్లడించిన వివరాల ప్రకారం 2016 ఆర్థిక సంవత్సరానికిగాను జైట్లీ బ్యాంకు బ్యాలెన్స్ గత ఏడాది రూ 3.52 కోట్ల నుంచి, రూ .1 కోటి వరకు తగ్గింది. . నాలుగు సేవింగ్స్ ఖాతాలున్నాయని (హెచ్డీఎఫ్సీలో మూడు, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా లో ఒకటి ). 15కేజీల వెండి,(5.54 కోట్లు) 5.6 కిలోల(1.35కోట్ల) బంగారం , రూ .45 లక్షలు వజ్రాభరాణాలు ఆయన సంపదలో భాగం. రెండు మెర్సెడెజ్ బెంజ్, ఒక హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, ఉండగా ఈ సంవత్సరం 86 లక్షల బీఎండబ్ల్యూ కారుతో కలిపి అయిదుకు చేరాయి. దీంతోపాటుగా డీసీఎం శ్రీరాం సంస్థలో 8 కోట్లు ఎంప్రో ఆయిల్స్ కంపెనీల్లో 9 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి.