డివైడ్ టాకొచ్చినా 'కృష్ణాష్టమి' జోరు!
చెన్నై: హీరో సునీల్ తాజా సినిమా 'కృష్ణాష్టమి' తొలి వీకెండ్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలికాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న సునీల్ ఎన్నో ఆశలతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు. కొంతవరకు డివైడ్ టాక్ వినిపించింది. రివ్యూల్లోనూ పెద్దగా ప్లస్ మార్కులు పడలేదు. అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో 'కృష్ణాష్టమి' సత్తా చాటుతూ.. ఈ రూ. 6 కోట్ల వరకు వసూలు చేసింది.
'మాస్ ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటున్నది. దీంతో వసూళ్లు బాగున్నాయి. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో రూ. 6 కోట్లు రాబట్టింది. ఇదే ఊపు మరికొన్ని రోజులు కొనసాగితే.. తొలివారం కలెక్షన్ల విషయంలో ఈ సినిమా విజయవంతమైనట్టే' అని ట్రేడ్ అనాలిసిస్ట్ త్రినాథ్ ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. దర్శకుడు వాసువర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గల్రానీ, దింపల్ చోపడ్ కథానాయికలుగా నటించారు. దిల్ రాజు నిర్మాత.